Betel Leaf : శరీరంలో కొవ్వు నిల్వలను కరిగించే తమలపాకు!

శొంఠి, మిరియాలు సమానంగా తీసుకుని తమలపాకు రసంలో తేనె కలుపుకుని తీసుకుంటే ఆస్తమా నయమై పోతుంది. ఊపరితిత్తులకు సంబంధించిన రోగాలను నయం చేసుకునేందుకు తమలపాకు రసం, అల్లం రసం సమానంగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

Betel Leaf : శరీరంలో కొవ్వు నిల్వలను కరిగించే తమలపాకు!

Fats

Updated On : May 9, 2022 / 3:44 PM IST

Betel Leaf : శుభకార్యాల్లో ఉపయోగించే తమలపాకుల్లో అనేక ఔషదగుణాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు దీని ద్వారా లభిస్తాయి. అనేక వ్యాధులను నయం చేసే శక్తి తమల పాకుల్లో ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు సమస్యలను నివారించటంలో బాగా ఉపకరిస్తుంది. తులసి, తమలపాకు కలిపి రసం తీసి పది చుక్కల చొప్పున ఇస్తే చిన్నారుల్లో జలుబు, దగ్గు వంటివి నయమై పోతాయి. కీళ్ల వాతం, మోకాళ్ల నొప్పులకు తమలపాకులను మెత్తగా పేస్ట్ లా చేసుకుని పూతలా వేసుకుంటే నొప్పుల నుండి మంచి ఉపశమనం లభిస్తుంది.

శొంఠి, మిరియాలు సమానంగా తీసుకుని తమలపాకు రసంలో తేనె కలుపుకుని తీసుకుంటే ఆస్తమా నయమై పోతుంది. ఊపరితిత్తులకు సంబంధించిన రోగాలను నయం చేసుకునేందుకు తమలపాకు రసం, అల్లం రసం సమానంగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పిల్లల్లో అజీర్తికి చెక్ పెట్టాలంటే తమలపాకుతో మిరియాలు చేర్చి కషాయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో వ్యర్ధాలను దూరం చేసే శక్తి తమలపాకుల్లో ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఆకును మలటం అలవాటుగా చేసుకోవటం మంచిది. తమలపాకుల్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ గాయాలు, ముఖ్యంగా కాలిన గాయాలు, వేగంగా మానిపోయేలా చేస్తాయి.

శరీరంలో కొవ్వు నిల్వలు అధికంగా పేరుకుని ఊబకాయంతో బాధపడే వారికి తమలపాకులకు చక్కగా ఉపకరిస్తాయి. ప్రతిరోజు తమలపాకుల్లో ఐదు మిరియాలు పెట్టుకుని బాగా నమిలి రసాన్ని మింగాలి. ఇలా చేయటం వల్ల ఫైటో న్యూట్రియంట్లు శరీరానికి అంది కొవ్వు నిల్వల్ని తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అధిక బరువు తగ్గటానికి వీటిలోని పోషకాలు సహాయపడతాయి. నోటి దుర్వాసన పోగొట్టటంలోను తమలపాకులో ఉపకరిస్తాయి. నోటిపూతల వంటి సమస్యలు దీనితో తొలగించుకోవచ్చు. తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిక్ రోగులలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించటంలో బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా యాంటీ డయాబెటిక్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

గమనిక; ఈ సమాచారాన్ని అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించి కేవలం అవగాహన కోసం మాత్రమే అందించటం జరిగింది. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స పొందటం మంచిది.