Bitter Gourd : రుచిలో చేదు.. ఆరోగ్యానికి మేలు..

రక్తలేమికు పూటకు ఒక చెంచా కాకారకు రసం తాగితే కడుపులో ఉండే హానికారక క్రిములు నాశనం అయి తరువాత రక్తవృద్ధి జరుగుతుంది. రోజూ కాకరకాయను వాడుతూ ఉంటే మధుమేహాం అదుపులో ఉంటుంది.

Bitter Gourd : రుచిలో చేదు.. ఆరోగ్యానికి మేలు..

Bitter Gourd

Updated On : November 4, 2021 / 7:35 PM IST

Bitter Gourd : కాకరకాయ…చేదుగా ఉండే ఈ కాకరకాయ కూరను తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అయితే చేదుగా ఉన్నప్పటికీ కాకరకాయను వివిధ రకాలుగా కూరలు చేసుకుని కమ్మగా లాగించే వారు మరికొందరు. దానిలో ఉండే చేదు వల్ల కాకరకాయను తినటానికి అంతగా ఆసక్తి చూపరు. అయితే కాకరకాయ మన ఆరోగ్యాన్ని కాపాడుతుందన్న విషయం చాలా మందికి తెలియదు. నిజానికి కాకరకాయ రుచిలో చేదుగా ఉన్నప్పటికీ పోషక, ఔషధ గుణాల్లో ఉత్తమమైనది.

కాలంతో సంబంధం లేకుండా కాకరకాయ కాస్తూనే ఉంటుంది. కాకరలో ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి, ఉంటాయి. కాకరకాయ శరీరంలోనే వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. వీటిని ఉడికించిన నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్లు దరిచేరవు. బీపీని కంట్రోల్ లో ఉంచేందుకు కాకర ఉపయోగపడుతుంది.

ఆరోగ్యానికి హాని చేసే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె జబ్బులతో పాటు క్యాన్సర్, మలబద్దకం, లివర్, మూత్రపిండాల సమస్యలకు కూడా కాకర మంచి ఆహారం. మధుమేహగ్రస్తులు కాకరకాయను తమ ఆహారంలో చేర్చుకుంటే ఇన్సులిన్ స్థాయిల్లో తేడా రాకుండా నియంత్రణలో ఉంచుతూ రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

రక్తలేమికు పూటకు ఒక చెంచా కాకారకు రసం తాగితే కడుపులో ఉండే హానికారక క్రిములు నాశనం అయి తరువాత రక్తవృద్ధి జరుగుతుంది. రోజూ కాకరకాయను వాడుతూ ఉంటే మధుమేహాం అదుపులో ఉంటుంది. కాకరకాయ కూరను భోజనంలో కొంచెంగా తింటూ ఉంటే సుఖ విరేచనం అవుతుంది. బరువు తగ్గాలనుకున్నా, శరీరంలో అనవసర కొవ్వు కరగాలన్నా కాకర రసం తాగాలి. కాకరలోని యాంటీ ఆక్సిడెంట్ లు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఉదర సంబంధ వ్యాధులను కాకర మంచి ఔషధం.

కాలిన గాయాలను, పండ్లను మాన్పడంలో కాకరకాయలోని గుణాలు బాగా పని చేస్తాయి. రక్తాన్ని శుద్ధి పరిచి గుండెకు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది. కాకరకాయ వల్ల గుండె సంబంధిత సమస్యలు రిస్క్ పూర్తిగా తగ్గుతుంది. కాకరకాయ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీలవుతుంది.

రుచిలో చేదుగా ఉన్నా కాకరను తరచుగా తీసుకుంటే ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది. శరీర కాంతిని మెరుగు పరుస్తుంది. కాకరకాయ రసాన్ని తరచూ పుక్కిలిస్తూ ఉంటే నోట్లో పుళ్ళు, నాలుక పూత తగ్గుతాయి. డయాబెటిస్ వంటి సమస్యల నుండి బయట పడడానికి కాకరకాయ నిజంగా ఎంతో మేలు చేస్తుంది. ఆస్తమా, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యల నుండి డయాబెటిస్ వరకు ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. కాకరకాయ వల్ల కాన్సర్ రిస్కు కూడా తగ్గుతుంది. కాకర తీసుకోవడం వల్ల కాన్సర్ కణాలు పెరగకుండా ఇది చూసుకుంటుంది.