Bronchitis Problem : బ్రాంకైటిస్ సమస్య…జాగ్రత్తలు
బ్రాంకైటిస్ తరచుగా వస్తూ ఉంటే అది దీర్ఘకాలిక బ్రాంకైటిస్‌గా మారడానికి అవకాశం ఎక్కువ. క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది,
Bronchitis
Bronchitis Problem : ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకువెళ్ళే గొట్టాలకు ఇన్ఫెక్షన్స్ రావడాన్నే బ్రాంకైటిస్‌గా పిలుస్తారు. దీనివల్ల దగ్గుపెద్ద శబ్దంతో వస్తుంది. ఒక్కోసారి తెమడతో కలిసివస్తుంది. బ్రాంకైటిస్ అనేది సాధారణంగా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది చాలా సాధారణమైన ఊపిరితిత్తుల సమస్య. శ్వాసకోశంలో, వాహికలో వాపు రావడం, దాంతో సంభవించే మార్పులనే బ్రాంకైటిస్ అంటారు. ఇందులో రెండు రకాలున్నాయి. అక్యూట్ బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్.
అక్యూట్ బ్రాంకైటిస్ 90 శాతం వైరస్ కారణం కాగా, 10 శాతం బ్యాక్టీరియాతో వస్తుంది. క్రానిక్ బ్రాంకైటిస్‌కూ, అక్యూట్ బ్రాంకైటిస్‌కు లక్షణాలలోనూ, ఊపిరితిత్తుల్లో జరిగే పరిణామాల్లోనూ తేడా ఉంటుంది. క్రానిక్ బ్రాంకైటిస్‌లో ఏడాదికి మూడునెలలపాటు దగ్గు, తెమడ ఉంటుంది. ఇది పొగతాగడం వల్ల, వాతావరణంలో మార్పులు, కాలుష్యం, ఇన్‌ఫెక్షన్స్ వలన శ్వాసనాళాలు దెబ్బతినడంతో వస్తుంది. ఇది పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. చల్లటి వాతావరణంలో వచ్చే జలుబు, ఫ్లూ జ్వరం, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ మైక్రో బ్యాక్టీరియమ్ నిమోనియా, దుమ్ము, ధూళి, పొగ, కెమికల్స్, సిగరెట్ పొగ కారణాల వల్ల బ్రాంకైటిస్ సమస్య ఉత్పన్నమౌతుంది.
వాయునాళాలు కుంచించుకుపోవడంతో ఛాతీలో పిల్లికూతలు వస్తాయి. పిల్లికూతల కంటే ముందే దగ్గు, జ్వరం కనిపిస్తాయి. కొంతమంది పిల్లలు వాతావరణం, కాలుష్యాల కారణంగా తేలికగా బ్రాంకైటిస్ బారినపడుతుంటారు. టాన్సిల్స్ ఇన్ఫెక్షన్, సైనస్ ఇన్ఫెక్షన్ మొదలైన బాధలకు గురైన పిల్లలు తరచుగా బ్రాంకైటిస్ వ్యాధికి కూడా గురవుతుంటారు. జ్వరం, చలి, కండరాల నొప్పులు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, దగ్గు వారం నుంచి రెండు వారాల పాటు ఉంటాయి. ఛాతీనొప్పి, దగ్గు విపరీతంగా ఉంటాయి. పిల్లి కూతలు, ఆయాసం,ఎక్కువ సేపు నడవలేకపోవడం వంటి సమస్యలు బ్రాంకైటిస్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
బ్రాంకైటిస్ తరచుగా వస్తూ ఉంటే అది దీర్ఘకాలిక బ్రాంకైటిస్‌గా మారడానికి అవకాశం ఎక్కువ. క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గి, ఆస్తమాకు దారి తీస్తుంది. బ్రాకైటిస్ సమస్యతో బాధపడతున్న వారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ధూమపానం అలవాటును మానుకోవాలి. దుమ్ము, ధూళికి, కాలుష్యానికి దూరంగా ఉండాలి, మంచినిద్ర, ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. ఆహారంలో ఎక్కువ భాగం ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి, క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయాలి. జలుబు కొద్దిగా ఉన్నప్పుడే, జలుబుతగ్గించడానికి అవసరమైన ట్రీట్ మెంట్ తీసుకోవాలి.
జ్వరం రాకుండా యాంటిపైరటిక్‌ను, ముక్కునుంచి కారుతున్న నీరు, చీముగా మరుతున్నప్పుడు యాంటిబయాటిక్స్‌ను వాడాలి. చల్లని నీటితో తలస్నానం చేయకూడదు. అలా చేస్తే జలుబుచేసే అవకాశం ఉంటుంది. తలస్నానం చేసిన వెంటనే తలను అరబెట్టుకోవాలి. శీతా కాలంలో ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్ తాగినపుడుగొంతు పట్టేసి ఇబ్బందిగా మారుతుంది.
