Lionel Messi : వ‌ర్చువ‌ల్‌గా 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్క‌రించిన మెస్సీ..

ఫుట్‌బాల్ దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ (Lionel Messi ) ప్ర‌స్తుతం భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్నారు.

Lionel Messi : వ‌ర్చువ‌ల్‌గా 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్క‌రించిన మెస్సీ..

Lionel Messi Unveils 70 Feet Statue In Kolkata

Updated On : December 13, 2025 / 11:46 AM IST

Lionel Messi : ఫుట్‌బాల్ దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ ప్ర‌స్తుతం భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. శ‌నివారం తెల్ల‌వారుజామున ఆయ‌న కోల్‌క‌తాకు చేరుకున్నారు. మెస్సీతో (Lionel Messi)పాటు అతడి ఇంటర్‌ మియామీ జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్‌ సువారెజ్ సైతం భార‌త్‌కు వ‌చ్చారు.

ఈ ఫుట్‌బాల్ దిగ్గ‌జాన్ని చూసేందుకు భారీ సంఖ్య‌లో అభిమానులు విమానాశ్ర‌యానికి వ‌చ్చారు. మెస్సీ మెస్సీ నామ‌స్మ‌ర‌ణ‌తో అత‌డికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

Taj Falaknuma Palace : మెస్సీ బసచేసే ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఒకరోజు ఉండాలంటే ఎన్ని లక్షలో తెలుసా? దీని ప్రత్యేకతలు ఏమిటంటే?

విమానాశ్ర‌యం నుంచి నేరుగా ఓ ఫైవ్‌స్టార్ ఓహోట‌ల్‌కు మెస్సీ చేరుకున్నారు. ఆ త‌రువాత ఉద‌యం బాలీవుడ్ న‌టుడు షారుక్‌ఖాన్‌తో క‌లిసి లేక్ టౌన్‌లో త‌న 70 అడుగుల విగ్ర‌హాన్ని వ‌ర్చువ‌ల్‌గా ఆవిష్క‌రించారు. భ‌ద్ర‌తాకార‌ణాల రీత్యా మెస్సీ విగ్ర‌హాం వ‌ద్ద‌కు వెళ్ల‌లేదు.

Vaibhav Suryavanshi : ఈ ఏడాది కోహ్లీ కంటే ఎక్కువ‌గా బుడ్డోడినే వెతికారు.. వైభ‌వ్ సూర్య‌వంశీ రియాక్ష‌న్ వైర‌ల్‌


వివిధ కార్య‌క్ర‌మాలు ముగియ‌గానే.. శ‌నివారం సాయంత్రం 4 గంట‌ల‌కు హైద‌రాబాద్‌కు మెస్సీ చేరుకోనున్నాడు. ముందుగా ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఆ త‌రువాత రాత్రి 7 గంట‌ల‌కు ఉప్ప‌ల్ స్టేడియంలో నిర్వ‌హించే ఎగ్జిబిష‌న్ మ్యాచ్‌లో పాల్గొనున్నాడు. ఈ మ్యాచ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కూడా ఆడ‌నున్నారు.