SBI Loans : రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ భారీ శుభవార్త.. వడ్డీరేట్లు తగ్గాయ్.. కానీ, వాళ్లకు మాత్రం బ్యాడ్‌న్యూస్
SBI Loans : రిజర్వ్ బ్యాంకు రెపో రేటు తగ్గింపు తరువాత దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
SBI Loans
SBI Loans : రిజర్వ్ బ్యాంకు రెపో రేటు తగ్గింపు తరువాత దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణగ్రహీతలకు భారీ శుభవార్త చెప్పింది. తన రుణ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీని ద్వారా ఇప్పటికే రుణాలు తీసుకున్న, కొత్తగా రుణతీసుకునే వారికి వడ్డీరేట్లు తగ్గనున్నాయి.
బ్యాంకు తీసుకున్న తాజా నిర్ణయంతో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ రేట్ (ఈబీఎల్ఆర్) 25 బేసిస్ పాయింట్లు కోత పెట్టనుండటంతో రుణాలపై వడ్డీరేటు 7.90శాతానికి దిగిరానుంది. అలాగే బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ – బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను కూడా ఐదు బేసిస్ పాయింట్లు కోత విధించింది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.75శాతం నుంచి 8.70శాతానికి దిగిరానుంది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఈఎంఐ చెల్లింపులు మరింత తగ్గనున్నాయి. తగ్గించిన వడ్డీ రేట్లు ఈనెల 15 నుంచి అమల్లోకి రానున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఆర్బీఐ రెపో రేట్లను కేంద్ర బ్యాంకు తగ్గిస్తున్న క్రమంలో బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించేందుకు రుణ రేట్లు ముఖ్యంగా హోం లోన్, వెహికల్ లోన్ వంటి వాటిపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. ఎస్బీఐ ఇదే నిర్ణయం తీసుకుంది. అయితే, ఇదే సమయంలో తమపై భారం తగ్గించుకునే క్రమంలో వెంటనే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తున్నాయి.
ఎస్బీఐ తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఎస్బీఐలో 2-3 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై సాధారణ ప్రజలకు వడ్డీ రేటు 6.45 శాతంగా ఉండగా.. ఇప్పుడు 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40 శాతానికి చేర్చింది. ఇదే సమయంలో సీనియర్ సిటిజెన్లకు అంతకుముందు 6.95 శాతంగా ఉండగా.. ఇప్పుడు 6.90 శాతానికి చేర్చింది. మిగతా టెన్యూర్లపై వడ్డీ రేట్లను పెద్దగా మార్చలేదు.
బ్యాంక్ తన స్పెషల్ ఫిక్స్ డ్ డిపాజిట్ ప్రొడక్ట్ .. 444 రోజుల వ్యవధితో అందిస్తున్న అమృత్ వృష్టి పథకం వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఇక్కడ అంతకుముందు వడ్డీ రేటును 6.60 శాతంగా ఉండగా.. దీనిని ఇప్పుడు 6.45శాతానికి తగ్గించింది. ఈ కొత్త వడ్డీరేట్లు కూడా డిసెంబర్ 15 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది.
