Beauty : నిమ్మతో సౌందర్యాన్ని పెంచుకోవచ్చా?

ముఖ్యంగా తక్కకువ ఖర్చులో అందుబాటులో ఉండే నిమ్మకాయ సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది. కొన్ని దశాబ్ధాలుగా నిమ్మను సౌందర్య సాధనంగా సబ్బుల్లో, అయిల్స్ లో ఉపయోగిస్తున్నారు.

Beauty : నిమ్మతో సౌందర్యాన్ని పెంచుకోవచ్చా?

Can Lemon Enhance Beauty

Updated On : July 10, 2022 / 4:09 PM IST

Beauty : అందంగా కనిపించాలని చాలా మంది కోరుకుంటుంటారు. ఇందుకోసం ఖరాదైన సౌందర్యసాధనాలను వినియోగిస్తుంటారు. అటు మార్కెట్లోకి అనేక కంపెనీలు సౌందర్య ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నాయి. వాటి ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే తక్కువ ఖర్చులో మార్కెట్లో దొరికే కొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులతో సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. పూర్వకాలం నుండి సహజ సిద్ధంగా దొరికే వాటిని సౌందర్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగిస్తున్నారు. అయితే నేటి తరం మాత్రం సరైన అవగాహన లేకపోవటం వల్ల సౌందర్య ఉత్పత్తులపై పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు.

మన చుట్టూ తక్కువ ఖర్చు లభించే దోసకాయ , గుమ్మడి కాయ, నారింజ, క్యారెట్, మందార, గులాబీ, నిమ్మకాయ, శనగపిండి వంటివి సౌందర్య సంరక్షణకు బాగా తోడ్పడతాయి. ముఖ్యంగా తక్కకువ ఖర్చులో అందుబాటులో ఉండే నిమ్మకాయ సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది. కొన్ని దశాబ్ధాలుగా నిమ్మను సౌందర్య సాధనంగా సబ్బుల్లో, అయిల్స్ లో ఉపయోగిస్తున్నారు. చుండ్రు సమస్యను తొలగించుకునేందుకు సాధారణంగా ఎక్కువ మంది నిమ్మ రసాన్ని తలకు రాసుకుని మర్ధన చేసుకుంటారు. ఇందుకే కాక నిమ్మను సౌందర్య సాధనంగా వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

ముఖం జిడ్డును వదిలించుకునేందుకు ఒక నిమ్మపండును తీసుకుని నిమ్మరసం తీసి దానిని చల్లని నీటిలో కలపాలి. ఆ నీటిని ముఖంపై చల్లుకుంటూ ఐదునిమిషాలు మర్ధన చేయండి. తరువాత మామూలు నీటితో ముఖం కడుక్కుంటే జిడ్డు తొలగిపోయి ముఖం మెరుపు సంతరించుకుంటుంది. కళ్లు అలసిపోయినట్లు ఉంటే నాలుగు చెంచాల నిమ్మరసాన్ని , నాలు స్పూన్ల ఐస్ వాటర్ లో కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో దూదిని ముంచి కళ్లు మూసుకుని కనురెప్పలపై దూదితో ముంచి కళ్లపై ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల కళ్లకు అలసటపోయి, కాంతి వంతంగా మారతాయి.

ముఖం పేలవంగా మారితో అరచెంచా నిమ్మరసాన్ని చెంచా గుమ్మడి రసం తో కలుపుకోవాలి. దానికి కొన్ని చుక్కలు రోజ్ వాటర్ యాడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించి 15 నిమిషాలపాటు అలా వదిలేయాలి. తరువాత శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల ముఖం కళకళలాడుతుంది. అలాగే నిమ్మరసం, రోజ్ వాటర్, గ్లిసరిన్ ల మిశ్రమం చక్కని హాండ్ లోషన్ గా ఉపయోగపడుతుంది. అరచేతులు మృధువుగా ఉండాలంటే నిమ్మరసంలో కొంచెం చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని అరచేతులకు రుద్దాలి. ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెలరోజులు చేస్తే చేతులు సున్నితంగా మారతాయి.