Self Determination : పిల్లలకు స్వీయ నిర్ణయశక్తి అవసరమే!
అందుకే చిన్నతనం నుండి సమస్యలను సొంతంగా ఎదుర్కొనే శక్తిని చిన్నారులకు అందించాలి. అన్ని సమయాల్లో వారిని వేలు పట్టుకుని నడిపించే కంటే భవిష్యత్తులో వారు సొంతంగా నడవటం తెలిసేలా నేర్పించాలి.

Children Need Self Determination
Self Determination : తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా పెంచుతుంటారు. వారికి కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుతుంటారు. కనీసం వారికి మంచి చెడు గురించి కనీసం అవగాహన లేకుండానే పిల్లలకు బదులుగా తల్లిదండ్రులే అన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలాంటి వైఖరి వల్ల వారు పెరిగి పెద్దయ్యాక ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసమయంలో అనుకోని రీతిలో ఎదురయ్యే సవాళ్లు వారి ఎదుగుదలకు అవరోధంగా నిలవటంతోపాటు, నిరాశ, నిస్పృహలు వారిని అవరిస్తాయి.
అందుకే చిన్నతనం నుండి సమస్యలను సొంతంగా ఎదుర్కొనే శక్తిని చిన్నారులకు అందించాలి. అన్ని సమయాల్లో వారిని వేలు పట్టుకుని నడిపించే కంటే భవిష్యత్తులో వారు సొంతంగా నడవటం తెలిసేలా నేర్పించాలి. దారితప్పుతుంటే సరైన దారిని చూపించడం వరకే తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. వారు ఓటమి పాలైన ప్రతి సందర్భంలో గుణపాఠాన్ని నేర్చుకునేలా చూడాలి. కుటుంబంలో సంక్షోభాలు తలెత్తిన సమయంలో తల్లిదండ్రులు వాటని ఎలా అధిగమిస్తారో పిల్లలు దగ్గరగా గమనిస్తారు. భవిష్యత్తులో తమకు ఎదురయ్యే సంక్షోభాలను వారు ఎదుర్కోనేందుకు ఇవి దోహదపడతాయి.
పిల్లలకు ఏదైనా కష్టం వచ్చిన సందర్భంలో తల్లి దండ్రులు వెంటనే జోక్యం చేసుకోకుండా కష్టాన్ని అధిగమించేలా వారిని ప్రోత్సహిస్తే సరిపోతుంది. ఓటమి ఎదురైన సందర్భంలో దానిని తట్టుకుని నిలబడి మళ్లీ విజయం దిశగా అడుగులు వేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని పిల్లలకు మొదటి నుండి నేర్పించాలి. కష్టం, సుఖం, ఆశ, నిరాశ ఇవన్నీ జీవితంలో అంతర్భాగం అనే విషయాన్ని బోధపడేలా పిల్లలకు మార్గనిర్ధేశం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది.