కరోనా వైరస్ మ్యూటేట్ అవుతోంది, కొత్తగా ఎదుగుతోంది. అందుకే కంట్రోల్ కావడం లేదు

Coronavirus Mutating: అమెరికాలో కరోనా వైరస్ మ్యూటేట్ అవుతోంది. ఎక్కువ వైరల్‌లోడ్‌కు మ్యూటేట్‌కు లింక్ కనిపిస్తోంది.
అమెరికా వైద్య పరిశోధకులు బుధవారం కొత్త స్టడీ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 5,000coronavirus genetic sequencesను స్టడీచేశారు. ఫలితం ఒక్కటే. వైరస్ క్రమంగా మ్యూటేట్ అవుతోంది. ఒకటికాదు, చాలా రకాలు. అవికూడా ఒకదానితో మరకొటి కలసి కొత్త రకం కరోనా వైరస్‌ను సృష్టిస్తున్నాయని అంటున్నారు. అందువల్లే కరోనా వ్యాప్తి పెరగిందంది.
ఈ మ్యూటేట్ వల్లే వైరల్‌లోడ్ ఎక్కువగా కనిపిస్తోందంట.ఇలా మ్యూటేట్ అయిన వైరస్ అమెరికాను కమ్మేసింది. వైరస్ జన్యువరసక్రమాన్ని బ్రిటన్‌లో ఇంతకుముందే పబ్లిష్ చేశారు. Houston studyలాగే, mutation వల్ల వైరస్ మీదున్న “spike protein” మారిపోయి, కణాలను బలంగా పట్టుకోవడంవల్లే కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉందని తేల్చేశారు.
కరోనా ప్రాణాంతకంగా మారుతోందా?
అలాగని ఈ మ్యూటేషన్ వల్ల వైరస్ ప్రాణాంతకరంగా మారుతుందా? ఈ ప్రశ్నకు మాత్రం స్టడీ సమాధానమివ్వలేదు. ప్రతివైరస్ genetic mutationsకు గురవుతుంది. అవన్నీ చిన్నచిన్న మార్పులే. ARS-CoV-2 లాంటి Coronavirusesలో పెద్దగా మార్పులు రావు. చాలావరకు వైరస్ స్వరూపం మారబోదని అంటున్నారు సైంటిస్ట్‌లు.
ఎప్పుడు వైరస్ మ్యూటేట్ అవుతోందో తెలియదు. జూదమాడినట్లే. కాకపోతే అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్, మారుతూనే ఉంటుంది. అందువల్లే వేలసంఖ్యలో కేసులు నమోవుదువుతూనే ఉంటాయి. కొత్తగా మారడానికి ప్రతి రోగీ వైరస్‌కు అవకాశమే. కొన్నిసార్లు వైరస్ మరింత ప్రమాదకరంగా మారొచ్చు. నిజానికి లక్షలమంది పాజిటీవ్ రోగులున్నారంటేనే, మ్యూటేట్ కావడానికి అన్ని అవకాశాలున్నట్లే లెక్క.