Covid Symptoms: వయస్సును, లింగాన్ని బట్టి కొవిడ్ లక్షణాల్లో మార్పు ఉంటుందని తెలుసా..

యావత్ ప్రపంచమంతా విరుచుకుపడిన కరోనా కారణంగా ప్రతి కుటుంబం నష్టపోయింది. ఈ మహమ్మారి అన్ని వయస్సుల వారిపై ప్రభావం చూపినా లక్షణాలు వయస్సును బట్టి, లింగాన్ని బట్టి వ్యత్యాసం ఉంది. ప్రత్యేకంగా నిర్వహించిన స్టడీలో ఈ కీలక విషయం బయటపడింది.

Covid Symptoms: వయస్సును, లింగాన్ని బట్టి కొవిడ్ లక్షణాల్లో మార్పు ఉంటుందని తెలుసా..

Corona Symptoms

Updated On : July 31, 2021 / 3:39 PM IST

Covid symptoms: యావత్ ప్రపంచమంతా విరుచుకుపడిన కరోనా కారణంగా ప్రతి కుటుంబం నష్టపోయింది. ఈ మహమ్మారి అన్ని వయస్సుల వారిపై ప్రభావం చూపినా లక్షణాలు వయస్సును బట్టి, లింగాన్ని బట్టి వ్యత్యాసం ఉంది. ప్రత్యేకంగా నిర్వహించిన స్టడీలో ఈ కీలక విషయం బయటపడింది. 60 నుంచి 80.. అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిలో కంటే 16-59 సంవత్సరాల వయస్సులో గమనించదగ్గ లక్షణాలు కనిపించినట్లు తెలిసింది.

ZOE Symptom Tracker app నుంచి తీసుకున్న డేటా ద్వారా పేషెంట్లలోని లక్షణాలు గమనించారు. ఆ తర్వాత కింగ్స్ కాలేజ్ లండన్ నిపుణులు దీనిని విశ్లేషించారు. మెషీన్ లెర్నింగ్ మోడల్ ద్వారా తెలుసుకున్న డేటాను బట్టి కొవిడ్ లక్షణాలు అనేవి విభిన్నమైన ఏజ్ గ్రూప్స్ లో, లింగాలను బట్టి మారుతున్నట్లు గమనించారు.

ఇందులో మొత్తం 18విభిన్నమైన లక్షణాలను గమనించారు. కొన్ని గ్రూపుల్లో కామన్ గా కనిపించే లక్షణాలు త్వరగా బయటపడ్డాయి. వాసన కోల్పోవడం, ఛాతీనొప్పి, ఆగకుండా దగ్గు, కడుపులో నొప్పి, పాదాల్లో మంటలు, కంటి దురదలు, అసాధారణ కండరాల నొప్పి వంటివి కనిపించాయి.

Covid

Covid

60ఏళ్ల పైబడ్డ వారిలో కనిపించిన వాసన కోల్పోయే గుణం 80ఏళ్లు పైబడ్డ వారిలో కనిపించలేదు. 60 నుంచి 79 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్నవారిలో విరేచనాలు అయినట్లు తెలిసింది.

నిపుణులు చెప్పిన దానిని బట్టి.. 60-79 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న వారిలో ఛాతీనొప్పి, శ్వాస అందకపోవడం, వాసన కోల్పోవడం కనిపిస్తే.. 80ఏళ్లు అంతకంటే పైబడ్డ వారిలో విరేచనాలు, గొంతులో మంట, ఛాతీనొప్పి, అసాధారణ కండరాల నొప్పి, కళ్లు మంటలు, వణుకుతో కూడిన జ్వరం సాధారణంగానే కనిపించాయి.

చిన్న వయస్సు వారిలో:

* వైరస్ వచ్చిన మూడు రోజుల్లో 16 నుంచి 39 సంవత్సరాల వయస్సు వారు వాసన కోల్పోయారు, ఛాతి నొప్పి, కడుపులో నొప్పి, శ్వాస అందకపోవడం, కళ్లు మంటలు వంటివి వచ్చాయి.

* 40 నుంచి 59సంవత్సరాల మధ్య ఉన్న వారిలో వణుకుతో కూడిన జ్వరం వచ్చినట్లు చెప్తున్నారు నిపుణులు. సాధారణంగా వైరస్ సోకిన వారిలో జ్వరం అనేది కామన్ అంశం. ఏ ఏజ్ గ్రూప్ లోనూ ముందుగానే ఈ లక్షణం కనిపించలేదు.

Coronavirus Recovery 5 Symptoms Of Covid 19

Coronavirus Recovery 5 Symptoms Of Covid 19

ఆడ – మగాల్లోనూ తేడా
పురుషులు.. మహిళల్లోనూ విభిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నట్లు నిపుణులు అంటున్నారు. మహిళలు ఎవరైతే 50సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారున్నారో.. వారికి కొవిడ్ సోకితే కొంచెం ఎక్కువకాలమే బాధపడాల్సి వచ్చింది. దాంతో పాటు అదే వయస్సున్న మగాళ్లు.. మహిళల కంటే రెట్టింపు సంఖ్యలో మృత్యువాతకు గురయ్యారు.

Corona Symptoms

Corona Symptoms

Covid Sympotms (1)

Covid Sympotms (1)

మగాళ్లలో శ్వాస అందకపోవడం, నీరసం, వణుకుతో కూడిన జ్వరం కనిపిస్తుంటే మహిళల్లో వాసన కోల్పోవడం, ఛాతీ నొప్పి, ఆగకుండా దగ్గు వస్తున్నాయి. ఇద్దరిలో కామన్ గా మాత్రం వాసన లేకపోవడం, ఛాతినొప్పి, కడుపులో నొప్పి కనిపిస్తున్నాయి.

ఇంకా హెల్త్ కేర్ సెక్టార్లో పనిచేసేవారిలో చలిజ్వరం, ఆగకుండా దగ్గు, తలనొప్పి, ఛాతినొప్పి గమనించదగ్గ లక్షణాలుగా ఉన్నాయి. అందరూ భావించినట్లుగా కరోనా లక్షణాలు మనుషుల్లో బరువును బట్టి మారలేదని డేటా చెప్తుంది.