Stroke Risk : సాధారణ లైఫ్ స్టైల్ మార్పులతో స్ట్రోక్ ప్రమాదం నుండి బయటపడవచ్చు తెలుసా!
స్ట్రోక్ లక్షణాల తేలికపాటివి. నిర్దిష్టంగా ఉండవు. తల తిరగడం, మైకం, తీవ్రమైన నీరసం ఏర్పడుతుంది. వికారం, అకస్మాత్తుగా పడిపోవటం వంటి పరిస్ధితులు ఎదురవుతాయి.

Lifestyle Modification for Secondary Stroke Prevention
Stroke Risk : మెదడులోని ఒక భాగానికి రక్త ప్రసరణ నిరోధించబడినప్పుడు లేదా తగ్గిపోయినప్పుడు మెదడు కణజాలం ఆక్సిజన్ మరియు పోషకాలను కోల్పోవడం వల్ల ఇస్కీమిక్ స్ట్రోక్ వస్తుంది. దీనివల్ల నిమిషాల వ్యవధిలోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ధమని నుంచి రక్తం అకస్మాత్తుగా మెదడులోకి రక్తస్రావం జరిగినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ సంభవిస్తుంది. దీని ఫలితంగా దెబ్బతిన్న మెదడుచే నియంత్రించబడే శరీర భాగంలోని కొన్ని అవయవాలు మెదడు నియంత్రణని కోల్పోతాయి.
స్ట్రోక్ లక్షణాల తేలికపాటివి. నిర్దిష్టంగా ఉండవు. తల తిరగడం, మైకం, తీవ్రమైన నీరసం ఏర్పడుతుంది. వికారం, అకస్మాత్తుగా పడిపోవటం వంటి పరిస్ధితులు ఎదురవుతాయి. అంతేకాకుండా చేతుల్లో బలహీనత, కాళ్ళు, పాదాలు సహా శరీరం ఓ వైపు బలహీనత, పక్షవాతం పదాలను తడబడుతూ చెప్పడం, మర్చిపోవడం, ఆకస్మిక తీవ్ర తలనొప్పి, దృష్ఠి కోల్పోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్ట్రోక్ లక్షణాలుగా గుర్తించిన 3 గంటలలోపు నిర్ధారణ చేసుకుని వెంటనే చికిత్సను అందించినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.
సాధారణ లైఫ్‌స్టైల్ మార్పుల ద్వారా మనం స్ట్రోక్ ప్రమాదం నుండి బయటపడవచ్చు. షుగర్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్, హోమోసిస్టీన్‌లను నియంత్రణలో ఉంచుకోవాలి. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించేందుకు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి మనం తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా, ఉప్పు, సంతృప్త కొవ్వులు తక్కువగా ఉండాలి. మెడికల్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం స్ట్రోక్ నివారణ మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం. మద్యం, పొగతాగటం వంటి అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యానికి శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.