Biscuits : ఆకలైతే బిస్కెట్లు తింటున్నారా… ఆరోగ్యానికి మంచిదేనా?..

ఆకలైన సందర్భంలో ఏదిపడితే అది తినకూడదు. ఆకలవుతున్న సమయంలో అందుబాలో పండ్లు ఉంటే తీసుకోవటం మంచిది. ఆరు బాదం పప్పులు, మూడు ఎండు ఖర్చూరాలు

Biscuits : ఆకలైతే బిస్కెట్లు తింటున్నారా… ఆరోగ్యానికి మంచిదేనా?..

Biscuits (1)

Updated On : August 17, 2021 / 3:07 PM IST

Biscuits : ఉరుకుల పరుగుల జీవితంలో తినేందుకు కూడా సరైన సమయం దొరకటంలేదు. ఒకవైపు పని మరోవైపు ఆకలి, తినేందుకు సమయం ఉండదు. పనిచేస్తున్న సమయంలో కడుపు నిండేందుకు ఏదో ఒకటి తినేస్తుంటారు చాలా మంది. అందుబాటులో ఉన్న సమోసాలో, బిస్కెట్లు, చిప్స్ ఇలా ఎదో ఒక ఆహారాన్ని తీసుకుంటుంటారు. ఇలా తీసుకునే వారిలో ఎక్కవ మంది బిస్కెట్లు తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా చేయటం వల్ల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిస్కెట్లను సహజంగా మైదా పిండి, చక్కెరతో తయారు చేస్తారు. మైదా పిండి సకల అనారోగ్యాలకు కారణం. ఇక దానికి చక్కెర కలిపితే చెప్పాల్సిన పనిలేదు. బరువు పెరగటంతోపాటు స్ధూలకాయం వంటి సమస్యలు ఈ రెండిటి వల్ల వచ్చేస్తాయి. మైదా, చక్కెరతో కాకుండా రాగులు, సజ్జలు, జొన్నలు వంటి మల్టీ గ్రెయిన్ ధాన్యాలతో తయారై బిస్కెట్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అలాంటి బిస్కెట్లను తీసుకోవటం మంచిది.

ఆకలైన సందర్భంలో ఏదిపడితే అది తినకూడదు. ఆకలవుతున్న సమయంలో అందుబాలో పండ్లు ఉంటే తీసుకోవటం మంచిది. ఆరు బాదం పప్పులు, మూడు ఎండు ఖర్చూరాలు తిన్నా సరిపోతుందటని న్యూట్రీషియన్ నిపుణులు సూచిస్తున్నారు. బిస్కెట్లకు బదులు నట్స్ తీసుకోవటం ఉత్తమం. యాపిల్ తోపాటు పీనట్ బటర్ కలిపి తీసుకోవటం వల్ల కడుపు నిండుగా ఉంటుంది.

బాగా ఆకలవుతున్న సందర్భంలో సమయానికి తినటానికి పండ్లుకాని, నట్స్ కాని దొరకని సందర్భంలో తప్పనిసరైతేనే రెండు మూడు బిస్కెట్లు తినవచ్చు. అలాగని ప్రతిరోజు ఆకలైతే మైదా పిండితో తయారైన బిస్కెట్లు తినటం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్నట్లే. బేక్ చేసిన పదార్ధాలు తినటం ఆరోగ్యానికి ఏమంత శ్రేయస్కరం కాదు.