B vitamins : మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచటంలో బి విటమిన్ల సముదాయం ఎలా సహాయపడతాయో తెలుసా ?

బి విటమిన్ల కోసం వివిధ సప్లిమెంట్ ఎంపికలు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజ ఆరోగ్యకరమైన ఆహారాల నుండి ఈ విటమిన్‌లను పొందడం ఉత్తమ మైన మార్గం. B6 అధికంగా ఉండే ఆహారాలలో చేపలు, గొడ్డు మాంసం కాలేయం ,ఇతర అవయవ మాంసాలు, పిండి కూరగాయలు , పండ్లు ఉన్నాయి.

B vitamins : మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచటంలో బి విటమిన్ల సముదాయం ఎలా సహాయపడతాయో తెలుసా ?

B vitamins

Updated On : October 10, 2023 / 12:20 PM IST

B vitamins : అవసరమైన మోతాదులో B విటమిన్లు రోజువారీగా ఆహారంలో ఉండేలా చూసుకోవటం ప్రతి ఒక్కరికి కీలకం. ఆహారాన్ని శక్తిగా మార్చే బాధ్యతను నిర్వర్తిస్తూ ఈ ముఖ్యమైన పోషకాలు మన శరీర పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. హై-డెన్సిటీ లైపోప్రొటీన్ (HDL) స్థాయిలను అనగా మంచి కొవ్వులను మెరుగుపరచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించటంలో బి విటమిన్లు సహాయపడతాయి.

READ ALSO : Pistachio For Blood Sugar : పిస్తాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయా ? వాటిని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే..

B విటమిన్లు, HDL మధ్య సంబంధం ;

B విటమిన్లు, ముఖ్యంగా B6, ఫోలిక్ యాసిడ్ (B9), మరియు B12 HDL కొలెస్ట్రాల్ స్థాయిల పెరుగుదలకు కీలకపాత్ర పోషిస్తాయి. హోమోసిస్టీన్ అనే పదార్థాన్ని నియంత్రించడానికి అవి కలిసికట్టుగా పనిచేస్తాయి. రక్తంలో హోమోసిస్టీన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ B విటమిన్లు HDL కొలెస్ట్రాల్ మెరుగుదలకు సహాయపడే హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గిస్తాయి.

ఆహారంలో బి విటమిన్లను ఎలా చేర్చుకోవాలి ;

బి విటమిన్ల కోసం వివిధ సప్లిమెంట్ ఎంపికలు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజ ఆరోగ్యకరమైన ఆహారాల నుండి ఈ విటమిన్‌లను పొందడం ఉత్తమ మైన మార్గం. B6 అధికంగా ఉండే ఆహారాలలో చేపలు, గొడ్డు మాంసం కాలేయం ,ఇతర అవయవ మాంసాలు, పిండి కూరగాయలు , పండ్లు ఉన్నాయి. ఫోర్టిఫైడ్ తృణధాన్యాలు, ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు మరియు బ్రెడ్‌లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.

READ ALSO : Okra for Diabetes : డయాబెటిక్-ఫ్రెండ్లీ ఆహారంగా బెండకాయ ఎలా తోడ్పడుతుందంటే ?

B12 కోసం, చేపలు, మాంసం, పౌల్ట్రీ, గుడ్లు, పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి. వీటిలో అధికంగా ఉండే ఆహారం సమతుల్య B విటమిన్ స్థాయిలు HDL కొలెస్ట్రాల్‌కు పెరగటానికి సహాయపడతాయి. ఆహారంలో B విటమిన్‌లను సమతుల్యం ఉండేలా చూసుకోవటం చాలా కీలకం. బి విటమిన్లు మోతాదు పెరిగితే వికారం, తిమ్మిరి, రక్తంలో ఐరన్ పెరగటం వంటి దుష్ప్రభావాలకు దారితీయవచ్చు.

ఆరోగ్యకరమైన జీవనశైలి , HDL కొలెస్ట్రాల్ స్థాయిల పెరుగుదల కోసం బి విటమిన్లు తీసుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం ద్వారా సహజంగా సిద్ధంగా B విటమిన్‌లను పొందవచ్చు. HDL కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ,గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో B విటమిన్ల సమతుల్య మేలు కలిగిస్తుంది.

సరైన మొత్తంలో B విటమిన్లు తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యకరంగా ఉండటానికి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి.