Tonsillitis : టాన్సిల్స్‌ సమస్యకు కారణాలు తెలుసా?..

చల్లగాలి సోకగానే టాన్సిల్స్‌ సైజు పెరిగి గొంతు నొప్పి మొదలవుతుంది. టాన్సిల్స్‌లో చీముతో పాటుగా తీవ్ర జ్వరం ఉంటుంది. గొంతులో ముల్లు గుచ్చుతున్నట్లుగా అనిపించి మింగినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది.

Tonsillitis : టాన్సిల్స్‌ సమస్యకు కారణాలు తెలుసా?..

Tonsils

Updated On : February 27, 2022 / 6:54 PM IST

Tonsillitis : టాన్సిల్స్‌ గొంతుకు ఇరువైపులా ఉంటాయి. శరీరానికి రక్షకభటులుగా విధినిర్వాహణ చేస్తుంటాయి. బయట నుండి వచ్చే సూక్ష్మక్రిములను, కాలుష్య కారక పదార్థాలను శరీరంలోకి రాకుండా అడ్గుపడటంలో వీటి పాత్ర ప్రముఖం. చలికాలంలో చాలా మంది చిన్నారులు ఈ టాన్సిల్స్ సమస్యతో బాధపడుతుంటారు. టాన్సిల్స్‌ సైజు పెరిగి వాపు రావడం వల్ల గొంతునొప్పి, జ్వరం వస్తుంది.

గొంతులో ఇన్‌ఫెక్షన్‌ కారక సూక్ష్మక్రిములు ఎక్కువ కావడం వలన టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురెై గొంతునొప్పి మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరిపడకపోవడం వల్ల టాన్సిల్స్‌ సమస్య వస్తుంది. టాన్సిల్స్ సమస్య ఉన్నవారిలో ఆహారం మింగటం, నీరు తాగటం, గాలి పీల్చడం, బాగా మాట్లాడటం కష్టంగా మారుతుంది. నోరు బొంగురు పోవడం, గొంతు తడారిపోయి గొంతు ఎరబ్రడడం, నోరు దుర్వాసన వస్తుంది. నీరసం, చికాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చల్లగాలి సోకగానే టాన్సిల్స్‌ సైజు పెరిగి గొంతు నొప్పి మొదలవుతుంది. టాన్సిల్స్‌లో చీముతో పాటుగా తీవ్ర జ్వరం ఉంటుంది. గొంతులో ముల్లు గుచ్చుతున్నట్లుగా అనిపించి మింగినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. టాన్సిల్స్ తో బాధపడేవారికి చల్లదనం గిట్టదు, వేడి పదార్థాలు తీసుకుంటే బాగా అనిపిస్తుంది. గొంతునొప్పి కుడివెైపు ఎక్కువగా ఉంటుంది. గొంతు పొడారిపోయి మింగటం కష్టంగా మారుతుంది. గొంతులో ఎరబ్రారి ఉంటుంది.

చల్లగాలిలో తిరగడం వలన టాన్సిల్స్‌ సైజు పెరిగి గొంతు నొప్పి వెంటనే ప్రారంభమవుతుంది. గొంతు నొప్పి రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంది. నోరు దుర్వాసన కొడుతుంది. టాన్సిల్స్ నివారణకు కొంతమంది హోమియో మందులను వాడుతుండగా, మరికొందరు శస్త్ర చకిత్స ద్వారా తొలగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే సమస్య వచ్చిన వెంటనే సరైన చికిత్స పొందటం మంచిది.