Secrets to strangers : అపరిచితులకు మీ రహస్యాలు చెప్పేస్తున్నారా? ఏం జరుగుతుందో తెలుసా…
ఆప్తుల కంటే అపరిచితులకు కొందరు తమ వ్యక్తిగత విషయాలు చెప్పేస్తుంటారు. ఇలా ముక్కు, మొహం తెలియని వారికి పర్సనల్ విషయాలు చెప్పుకోవడం వల్ల ఏం జరుగుతుంది?

Secrets to strangers
Secrets to strangers : బస్సులోనో, ఫ్లైట్‌లోనో, మెట్రోలోనో కొత్తగా కొందరు పరిచయం అవుతారు. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోకుండానే .. మొదటి పరిచయంలోనే వారితో తమ వ్యక్తిగత విషయాలు పంచేసుకుంటారు. ముక్కూ, మొఖం తెలియని వారితో ఇలా రహస్యాలు పంచుకోవడం కరెక్టేనా?
Seasonal Depression : చలికాలంలో ఎదురయ్యే మానసిక సమస్యలు !
కొంతమంది మొదటి పరిచయంలోనే అపరిచితులతో తమ వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు. ఆనక అరే.. ఎందుకిలా చేసాను? అని బాధపడతారు. ఇలా జరగడం సాధారణమే అని మానసిక శాస్త్రం చెబుతోంది. ఒకే రకమైన మైంట్ సెట్ ఉన్న వ్యక్తులు ఏ మాత్రం పరిచయం లేకపోయినా తమ వ్యక్తిగత విషయాలు పంచుకోవడానికి ఆలోచించరట. మొదటి పరిచయంలోనే అంతగా దగ్గరవుతారట.
ఒక్కోసారి కొత్తగా పరిచయం అయిన వారు వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు చెప్పడం మొదలుపెట్టగానే వింటున్నవారు కూడా తమ పర్సనల్ విషయాలు చెప్పడం మొదలుపెడతారు. ఈ విషయం వారు గ్రహించుకునేలోపు తమ విషయాలు చెప్పేస్తుంటారు. ఒకేలా ఆలోచించేవారు.. ఒకే రకమైన ఇష్టాఇష్టాలు ఉన్న వ్యక్తుల మధ్య ఇలా సంభవిస్తుందట. అటువంటి వ్యక్తుల్ని త్వరగా నమ్మడం వల్ల పర్సనల్ విషయాలు చెప్పేస్తుంటారు. ఎవరైనా తమ విషయాలు షేర్ చేసుకోవడం మొదలుపెట్టగానే వినాలి తప్ప మన పర్సనల్ విషయాలు చెప్పకూడదు. చర్చ మరింత లోతుగా వెళ్లిపోతోందనుకున్నప్పుడు టాపిక్‌ను మార్చాలి. లేదా అక్కడితో ఆ సంభాషణను ఆపేయాలి. అలాగని చెబుతున్నవారి పట్ల విసుగు చూపించకుండా నెమ్మదిగా డైవర్ట్ చేయాలి.
అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు చెప్పడం వల్ల పెద్దగా నష్టం ఉండదనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే వారితో పంచుకున్న వ్యక్తిగత విషయాలు బయటకు వెళ్లే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే షేర్ చేసుకున్న విషయాలను బయటకు చెప్పి వారు హాని కలిగించే అవకాశం ఉండకపోవచ్చు. అయితే పరిచయం ఉన్న వ్యక్తుల విషయంలో వేరుగా ఉంటుంది. అందుకే చాలామంది ఆప్తుల దగ్గర అనేక విషయాలు చెప్పకుండా దాచి పెడతారు. నిజానికి కొన్ని విషయాలు బయటకి చెప్పుకోవడం వల్ల ఊరట దొరుకుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.