New Year 2025 : జనవరి 1నే న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జనవరి 1 న న్యూ ఇయర్స్ డే ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. కొత్త క్యాలెండర్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. అదంతా సరే.. అసలు జనవరి 1 నూతన సంవత్సర వేడుకలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

New Year 2025 : కొత్త సంవత్సరం రాగానే క్యాలెండర్ మారుస్తాం. జనవరి 1 ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. కొత్త లక్ష్యాలు, తీర్మానాలు చేసుకుంటాం. అయితే జనవరి 1 వ తేదీన న్యూ ఇయర్ వేడుకలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జనవరి 1 న క్యాలెండర్ మారుతుంది. కొత్త సంవత్సరం మొదలవుతుంది. కుటుంబసభ్యులు, స్నేహితులు అంతా ఒకచోట చేరి సంబరాలు జరుపుకుంటారు. కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కం చెబుతారు. ఇదంతా సరే.. అసలు నూతన సంవత్సర వేడుకలు జనవరి 1 న ఎందుకు జరుపుకుంటాం అంటే.. దీని వెనుక చారిత్రక కారణాలు ఉన్నాయి.
క్రీ.పూ 45 నుండి కొత్త సంవత్సరం జనవరి 1 న జరుపుకోవడం ప్రారంభించారు. దీనికి ముందు రోమన్ క్యాలెండర్ మార్చిలో ప్రారంభమైంది. అది 355 రోజులు కొనసాగింది. అయితే రోమన్ నియంత జూలియస్ సీజర్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాలెండర్‌ను మార్చారు. జనవరి నెలకు రోమన్ల దేవుడైన జానస్ పేరు పెట్టడంతో పాటు జనవరి 1 న నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని జూలియస్ అధికారికంగా ప్రకటించాడు.
కాగా జనవరి 1 న్యూ ఇయర్స్ డేగా జరుపుకోవడానికి 16 వ శతాబ్దం మధ్య వరకు కూడా ఐరోపాలో అంగీకరించలేదు. పోప్ గ్రెగోరీ జూలియస్ క్యాలెండర్‌ను మార్చి జనవరి 1 నూతన సంవత్సర ప్రారంభదినంగా అధికారికంగా ప్రకటించేవరకు ఆమోదించలేదు. ఇక కొత్త సంవత్సరం దాదాపుగా 2,000 BC లేదా 4,000 ల సంవత్సరాల క్రితం పురాతన బాబిలోన్‌లో ప్రారంభమైందని భావిస్తారు.
మార్చి చివరలో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ బాబిలోనియన్లు ‘అకిటు’ పేరుతో వేడుక జరుపుతారు. 11 రోజుల పాటు ప్రతి రోజు ప్రత్యేకమైన వేడుక నిర్వహిస్తారు. 1752 లో బ్రిటీషు ప్రభుత్వం కూడా గ్రెగోరియన్ కేలండర్‌ను అమలు చేస్తూ జనవరి 1 న అధికారంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించింది. అలా జనవరి 1 న న్యూ ఇయర్స్ డే జరుపుకోవడం ప్రారంభమైంది.
న్యూ ఇయర్స్ డే వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జనవరి 1 న నిర్వహిస్తారు. ఆయా దేశాల కాలమానాల ప్రకారం కాస్త సమయం అటూ ఇటూగా ఈరోజు జరుపుకుంటారు. ఒక్కో దేశంలో వారి ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు. విందు-వినోదాలతో సంతోషంగా గడుపుతారు. ఈ రోజును ఎంత సంతోషంగా ఆహ్వానిస్తే సంవత్సరం మొత్తం అంతే ఆనందంగా ఉంటామని భావిస్తారు.
న్యూఇయర్ సంబరాల కోసం ఆన్‌లైన్‌లో యూజర్లు అత్యధికంగా ఏమేం బుక్ చేసుకున్నారో తెలుసా?