న్యూఇయర్‌ సంబరాల కోసం ఆన్‌లైన్‌లో యూజర్లు అత్యధికంగా ఏమేం బుక్‌ చేసుకున్నారో తెలుసా?

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్ ఇతర ఫాస్ట్ డెలివరీ స్టార్టప్‌లు తమకు వచ్చిన ఆర్డర్ల గురించి వివరాలు తెలిపాయి.

న్యూఇయర్‌ సంబరాల కోసం ఆన్‌లైన్‌లో యూజర్లు అత్యధికంగా ఏమేం బుక్‌ చేసుకున్నారో తెలుసా?

Updated On : January 1, 2025 / 4:32 PM IST

New Year 2025: న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ వేళ భారత్‌లో చాలా మంది డెలివరీ యాప్‌లలో రికార్డు స్థాయిలో ఆర్డర్లు చేశారు. పార్టీ మూడ్‌కి అనుగుణంగా ద్రాక్ష నుంచి కండోమ్‌ల వరకు, చిప్‌ ప్యాకెట్ల నుంచి హ్యాండ్‌కఫ్‌ల వరకు ఎన్నో రకాల ఆర్డర్లు వచ్చాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్ ఇతర ఫాస్ట్ డెలివరీ స్టార్టప్‌లు తమకు వచ్చిన ఆర్డర్ల గురించి వివరాలు తెలిపాయి.

బ్లింకిట్ సహ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా తెలిపిన వివరాల ప్రకారం.. పార్టీల్లో తినే చిప్స్, కోక్, నామ్‌కీన్ వంటి వాటి కోసం ఆర్డర్లు అధికంగా వచ్చాయి. తమ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు డిసెంబర్ 31 రాత్రి 8 గంటల వరకు 2.3 లక్షల ప్యాకెట్ల ఆలూ భుజియా, 6,834 ఐస్ క్యూబ్‌ల ప్యాకెట్లను డెలివరీ చేశారని ఎక్స్‌లో తెలిపారు.

అదే సమయంలో అమ్ముడుపోయిన కండోమ్‌లలో 39 శాతం చాక్లెట్ ఫ్లేవర్‌వి ఉన్నాయని, స్ట్రాబెర్రీవి 31 శాతం ఉన్నాయని చెప్పారు. నిన్న సాయంత్రం కస్టమర్లు ద్రాక్షను అధికంగా ఆర్డర్ చేయడం పట్ల ధిండా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మరోవైపు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో నిన్న రాత్రి 7.30 గంటలకు నిమిషానికి 853 చిప్స్ ప్యాకెట్ల ఆర్డర్‌లు వచ్చాయని ఆ సంస్థ తెలిపింది. ఐస్ క్యూబ్‌ల ప్యాకెట్లు మొత్తం కలిపి నిన్న రాత్రి 7.41 సమయంలో నిమిషానికి 119 కిలోలు డెలివరీ చేసినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ చెప్పారు.

బిగ్‌బాస్కెట్‌లో నాన్ ఆల్కహాల్ పానీయాల అమ్మకాలు 552 శాతం, డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్ల అమ్మకాలు 325 శాతం పెరిగాయి. సోడ్‌, మాక్ టెయిల్ విక్రయాలు కూడా 200 శాతం పెరిగాయి.

KTR: అసలు అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడది?: కేటీఆర్