Copper : రాగి చెంబులో నీరు తాగితే జీర్ణ వ్యవస్ధ మెరుగవుతుందా?
రాగి చెంబులో నీరు నిల్వ చేసుకుని తాగటం వల్ల మెదడు శక్తి వంతంగా తయారవుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ గ్రంధి పనితీరు సవ్యంగా ఉంటుంది.

Copper Water1
Copper : రాగి బిందె, రాగి చెంబుల్లో నీటిని నిల్వచేసుకుని వాటిని తాగటం అన్నది పురాతన కాలం నుండి చాలా మంది అనుసరిస్తున్నారు. ప్రస్తుత అధునిక యుగంలో మినరల్ వాటర్ కి అలవాటు పడి రాగి చెంబులో నీటిని తాగటమే మర్చిపోయారు. వాస్తవానికి రాత్రిపూట రాగి చెంబులో నీళ్లు నిలవ చేసి ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడున తాగటం వల్ల జీర్ణ వ్యవస్ధ మెరుగవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు. రాగి చెంబులో నీరు తాగటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్ స్ధాయి తగ్గుతుంది.
రాగి చెంబులో నీరు నిల్వ చేసుకుని తాగటం వల్ల మెదడు శక్తి వంతంగా తయారవుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ గ్రంధి పనితీరు సవ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంపొందించటంలో సైతం రాగి చెంబులో నీరు తోడ్పడుతుంది. రాగి పాత్రలో నీటిని ఉపయోగించటం వల్ల ఎముకల్లో పటుత్వం పెరిగటంతోపాటు దృఢంగా , ఆరోగ్యవంతంగా మారతాయి. రాగిపాత్రల్లో వంటలు వండటం, అదే ఆహారాన్ని తీసుకోవటం వల్ల కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యవంతంగా పనిచేస్తాయి.
చిన్నవయస్సులో జట్టు తెల్లబడటం, చర్మం త్వరగా ముడతలు పడటం , వంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే రాగి చెంబులో నీరు తాగటం శ్రేయస్కరం. ఊబకాయం, మలబద్ధకం, గుండెపోటు వంటి సమస్యలను దరి చేరకుండా చూసుకోవచ్చు. రాగి కడియం, ఉంగరాలు ధరించటం వల్ల శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా బీపీ ని నియంత్రణలో ఉంచవచ్చు. మెదడు చురుకుదనం పెంచటంతోపాటు, రక్త ప్రసరణను క్రమబద్దీకరించటంలో తోడ్పడుతుంది. జ్ణాపకశక్తిని పెంపొందించటంలో రాగి చెంబులో నీరు ఉపకరిస్తుంది.