Banana Leaves : అరిటాకులో భోజనం ఎందుకు చేస్తారో తెలుసా?

పండుగ రోజుల్లో, ప్రత్యేకమైన వేడుకల్లో అరిటాకులో భోజనం చేస్తాం. అతిథులకు అరిటాకులో భోజనం పెడతాం. అసలు అరిటాకులో భోజనం చేయడం వల్ల ఉపయోగం ఏంటి?

Banana Leaves : అరిటాకులో భోజనం ఎందుకు చేస్తారో తెలుసా?

Banana Leaves

Banana Leaves : దక్షిణ భారతదేశంలో చాలామంది అరిటాకులో భోజనం చేస్తారు. పండుగల్లో, ప్రత్యేకమైన రోజుల్లో అతిథులకు అరిటాకులో భోజనం వడ్డిస్తారు. కానీ ఎందుకు చేస్తారు? అనేది అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. అరిటాకులో భోజనం ఫ్రెష్ ఫీల్‌ని ఇవ్వడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది.

Tips to keep bananas fresh : అరటిపండు త్వరగా రంగు మారకుండా ఉండాలంటే ఇలా చేయండి

అరిటాకులో భోజనం చేసినపుడు దానిలో ఉండే పోషకాలు అన్నీ మనం తినే ఆహారంలోకి వెళ్తాయి. ఈ పోషకాలలో సహజ యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిండెంట్ లక్షణాలు ఉండే పినాలస్, ఫ్లేవనాయిడ్స్, ప్రోయాంతోసైనిడిన్స్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. అలాగే అరటి ఆకులపై మైనపు పూతలాంటి తేలికైన రుచి ఉంటుంది. వేడి వేడి ఆహారం ఆ పూతకి తగిలినపుడు అది కొద్దిగా కరుగుతుంది. దాంతో మనం తినే ఆహారం రుచి మరింత బాగుంటుంది. అలాగే అరటి ఆకులు కాలుష్య కారకాలు కావు. వాటిని ఉపయోగించిన తరువాత కంపోస్ట్‌గా వాడుకోవచ్చు. మనం తినే ప్లేట్స్ సబ్బు పెట్టి కడుగుతాం. వాటి కెమికల్స్ ఆనవాళ్లు కంచాలపై ఎంతో కొంత ఉంటాయి. అరటి ఆకుపై మైనపు పూత ఉండటం వల్ల దుమ్ము, ధూళీ అంతగా నిలిచి ఉండవు.  నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

 

అరటి ఆకుపై తింటే అన్ని విధాల మేలు జరుగుతుంది. అరటి ఆకుల్లో పాలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి అనారోగ్యాల బారి నుంచి రక్షిస్తాయి. పార్కిన్సన్ వ్యాధికి చికిత్స చేయగల ఎంజైమ్ పాలీఫెనాల్ ఆక్సిడేస్ అరటి ఆకుల్లో ఉంటుందట. అరటి ఆకులలో విచిత్రమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. ఆహారంలోని బాక్టీరియాను నాశనం చేస్తాయి. అనేక వేడుకలలో అలంకారంగా కూడా ఈ ఆకుల్ని వాడతారు.

Hungry Student : ఆకలేసిందట.. మ్యూజియంలో 98 లక్షల విలువ చేసే అరటిపండు కళాఖండాన్ని తినేసిన స్టూడెంట్.. ఇదేం విడ్డూరం?

అరటి ఆకులు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటిని శుభ్రం చేసి గుడ్డలో ఆరబెట్టి గాలి చొరబడని ప్లాస్టిక్ సంచిలో నిల్వ చేయాలి. లేదా ఫ్రీజర్లో బ్యాగ్ ఉంచినా 10 నుంచి 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. అప్పుడప్పుడు ప్లేట్‌కు బదులు అరటి ఆకులో ఆహారం తినడానికి ప్రయత్నించండి. ఆరోగ్యంతో పాటు ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది.