Women Long Life: ప్రకాశవంతమైన పండ్లు తినే మహిళల్లో పెరుగుతున్న ఆయుర్దాయం
మగవారి కంటే సగటున ఎక్కువ కాలం జీవించే మహిళలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. వీరంతా యామ్స్, బచ్చలకూర, పుచ్చకాయ, టమాటాలు, ఆరెంజ్ లు, క్యారెట్లు లాంటి మంచి డైట్ తీసుకోవడం బెటర్ అని రీసెంట్ స్టడీ చెప్తుంది. జార్జియా యూనివర్సిటీ జరిపిన స్టడీలో ఇవి తీసుకోవడం వల్ల జబ్బులు తక్కువపడినట్లు తెలిసింది.

Women Food
Women Long Life: మగవారి కంటే సగటున ఎక్కువ కాలం జీవించే మహిళలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. వీరంతా యామ్స్, బచ్చలకూర, పుచ్చకాయ, టమాటాలు, ఆరెంజ్ లు, క్యారెట్లు లాంటి మంచి డైట్ తీసుకోవడం బెటర్ అని రీసెంట్ స్టడీ చెప్తుంది. జార్జియా యూనివర్సిటీ జరిపిన స్టడీలో ఇవి తీసుకోవడం వల్ల జబ్బులు తక్కువగా పడినట్లు తెలిసింది. ఈ కలర్‌ఫుల్ పండ్లు మానసికంగానే కాకుండా, శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉంచుతాయని తేలింది.
యూజీఏ ఫ్రాంక్లిన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైకాలజీ బిహేవియరల్ అండ్ బ్రైన్ సైన్సెస్ ప్రోగ్రామ్ సహ రచయిత బిల్లీ ఆర్. హమండ్ స్టడీ నిర్వహించారు.
మగాళ్లలో తక్కువగా జబ్బులు వచ్చినా చనిపోయేందుకు ఎక్కువగా కారణం అవుతాయి. అదే మహిళలు తరచూ జబ్బుపడినా ఎక్కువకాలం జీవిస్తారు అలా కాకుండా మహిళలు వారి జీవన విధానంలో మార్పులు చేసుకుంటే ఎక్కువ కాలం జబ్బు తక్కువ పడి జీవించే అవకాశాలు ఉన్నాయని స్టడీ చెప్తుంది.
Read Also : మహిళలు ఉద్యోగంతోపాటు ఆరోగ్యం విషయంలోనూ!
మగాళ్ల కంటే మహిళల్లో కొవ్వు శాతం ఎక్కువ. చాలా వరకూ శరీరం విటమిన్లు, మినరల్స్ ను శరీర కొవ్వు నుండి తీసుకుంటుంది. ఆ రకంగా చూస్తే గర్భిణీ మహిళల్లో ఈ లక్షణాలెక్కువ. పిగ్మెంటెడ్ కెరొటినాయడ్స్ మానవ డైట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తుంది. ల్యూటిన్, జీక్సంథిన్ అనే పదార్థాలుగా కంటికి, మెదడుకు నేరుగా నాడీకణ వ్యవస్థకు సహాయపడతాయి.
మహిళలు, మగాళ్లు ఇవి సమాన మొత్తంలో తీసుకున్నప్పటికీ మగాళ్ల కంటే మహిళలకే వీటి అవసరం ఎక్కువగా ఉంటుంది.
“తీసుకునే ఆహారం బ్రెయిన్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం ఎలా కనిపించాలి. మన మూడ్, గుర్తింపు లాంటివి ఇట్టే మారిపోతాయి” అని హమ్మండ్ అంటున్నారు. మన మలంలో మైక్రోబయోమ్, బ్యాక్టీరియాల ద్వారా వాటిని పరీక్షించగలం. ఇవన్నీ మన బ్రెయిన్ స్ట్రక్చర్ ఎలిమెంట్స్ ను డెవలప్ చేయడంతో పాటు న్యూరో ట్రాన్స్‌మిట్టర్స్ పనులను కంట్రోల్ చేయగలుగుతాయి” అని స్టడీ వెల్లడించింది.