మరణించినా ప్రమాదమే? మృతదేహం నుంచి సోకిన తొలి కరోనా కేసు.. సైంటిస్టుల రిపోర్ట్!

ప్రపంచాన్ని కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాప్తిస్తోంది. రోజురోజుకీ ఎన్నో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ షాకింగ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు కరోనా సోకడం మాత్రమే చూశాం.. ఇప్పుడు వైరస్ సోకిన వ్యక్తి మృతదేహం నుంచి తొలి కరోనా కేసు నమోదైంది. ఈ విషయాన్ని సైంటిస్టులు వెల్లడించారు. కరోనాతో మృతిచెందిన వారి మృతదేహం నుంచి కూడా వైరస్ ఇతరులకు సోకుతుందనే విషయం మరింత భయాందోళన కలిగిస్తోంది.
మరణం తరువాత కూడా కరోనా పాజిటివ్ వ్యక్తి నుంచి ఇతరులకు వైరస్ సోకుతుంది. COVID-19తో చనిపోయిన రోగి నుండి వైద్య పరీక్ష చేసిన వ్యక్తికి వైరస్ సోకిన మొదటి కేసును థాయిలాండ్ నివేదించింది. మార్చూరీలో లేదా అంత్యక్రియల గృహాల్లో పనిచేసేవారిని ఈ విషయం ఆందోళనకు గురిచేస్తోంది. “మెడికల్ ఎగ్జామినర్స్ మాత్రమే కాదు.. మోర్గ్ టెక్నీషియన్లు అంత్యక్రియల గృహాల్లోని వారంతా అదనపు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది’ అని Buzzfeed నివేదిక ప్రకారం CUNY’s John Jay College of Criminal Justice పాథాలజీ ప్రొఫెసర్ Angelique Corthals చెప్పారు.
ఆందోళన కరమైన విషయంగా ఆయన పేర్కొన్నారు. ‘ఫోరెన్సిక్ మెడిసిన్ యూనిట్లో వైద్య సిబ్బందిలో COVID-19 వ్యాప్తి మరణంపై ఇది మొదటి నివేదిక’ అని జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ అండ్ లీగల్ మెడిసిన్ అధ్యయనం తెలిపింది. ఆపరేషన్ గదులలో ఉపయోగించే క్రిమిసంహారక విధానం పాథాలజీ / ఫోరెన్సిక్ యూనిట్లలో కూడా వర్తించవచ్చు” అని తెలిపింది.
బ్యాంకాక్‌లోని RVT మెడికల్ సెంటర్‌కు చెందిన Sriwijitalai, చైనాలోని హైనాన్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన Viroj Wiwanitkit ఇద్దరు జర్నల్ కు చెందిన రచయితలు ఉన్నారు. ‘ప్రస్తుతం, COVID-19తో బాధిత మృతదేహాల సంఖ్యపై ఖచ్చితమైన సమాచారం లేదు. ఎందుకంటే థాయిలాండ్‌లోని మృతదేహాలలో COVID-19 కోసం పరీక్షించడం సాధారణ పద్ధతి కాదు’ అని తెలిపింది.
థాయిలాండ్‌లో కేవలం 2500 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు పైగా వ్యాధి సోకింది. మొత్తం మరణాల సంఖ్య 136,000 కు పైగా ఉంది. ప్రపంచం ఇప్పటికీ వైరస్ గురించి కొత్త విషయాలను తెలుసుకుంటోంది. ఈ విషయాలు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని WHO ఇప్పటికే
దీనిని మహమ్మారిగా ప్రకటించింది. ఇది స్వైన్ ఫ్లూ కంటే 10 రెట్లు ఎక్కువ ప్రాణాంతకమని అధికారికంగా తెలిపింది. కరోనా వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్నిదేశాలు లాక్ డౌన్ విధించాయి.