Weight Problem In Winter : చలికాలంలో వేధించే అధిక బరువు సమస్య! ఆహారంలో మార్పులు చేయాల్సిందేనా?
చలికాలంలో అకుపచ్చని ఆహారాలను తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. ఆకుకూరలు, కాయగూరలు వంటివాటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. అందువల్ల శీతాకాలంలో అవి ఎక్కువగా తినాలి.

Why you gain weight in winters and how to prevent it
Weight Problem In Winter : చలికాలంలో అధిక బరువు సమస్య అందరిని వేధిస్తుంది. ఈ కాలంలో చాలా మంది నీరు తక్కువ తాగి, ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటుంటారు. దీని వల్ల బరువు పెరుగుతారు. చలికాలంలో ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకోవాలి. వెచ్చని ఆహారం శరీర ఉష్ణోగ్రత పెంచడానికి, మానసిక స్థితిని పెంచేందుకు సహాయపడుతుంది. అయితే అదనపు కార్బ్స్, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాల వల్ల బరువు పెరుగుతారు. బరువు పెరగకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఆహారాలను ఎంచుకోవాలి.
చలికాలంలో అకుపచ్చని ఆహారాలను తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. ఆకుకూరలు, కాయగూరలు వంటివాటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. అందువల్ల శీతాకాలంలో అవి ఎక్కువగా తినాలి. వీటిని తినటం వల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ అంతగా పెరగవు. మధుమేహం ఉన్నవారు ఈ ఆహారం తినడం మేలు కలుగుతుంది. శీతాకాలంలో అరటి, జామకాయ, పియర్స్, రేగుపండ్లు, సీతాఫలాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటిని సలాడ్ల రూపంలో తీసుకుంటే ఎంతో మంచిది. పప్పులు, బద్దలు, గింజలు, తృణధాన్యాల వంటివి మనకు ఎక్కువ ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి.
శరీరంలో వేడిని పెంచే బాదం, వాల్‌నట్స్, అవిశె గింజలు, నల్ల నువ్వులు, దోసకాయ గింజల వంటివి తింటే ఫలితం కనిపిస్తుంది. సీజన్‌లో స్వీట్ క్రీముల వంటివి తినకుండా క్లియర్ సూప్స్ తీసుకోవటం మంచిది. స్పైసీ సూప్స్ చెడు కొవ్వును తరిమేస్తాయి. వాటిలో వేసే మిరియాల పొడి వల్ల జలుబు, దగ్గు వంటివి దరిచేరవు. స్నాక్స్‌ని అతిగా ఫ్రై చేసి తీసుకోవద్దు. దీనివల్ల కొవ్వు పెరుగుతుంది. తద్వారా బరువు పెరుగుతారు. స్నాక్స్ బదులు చాట్ మసాలా, క్యారట్ స్టిక్స్, బీట్ రూట్, నిమ్మరసం ఇలా రకరకాల ఆప్షన్లను ఎంచుకోవాలి. ఆహారాలతోపాటు రోజువారిగా కొంత సమయం శారీరక వ్యాయామానికి కేటాయిస్తే బరువు పెరగకుండా చూసుకోవచ్చు.