Non-Alcoholic Fatty Liver : ప్రాణాంతకంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్.. సమస్య నుండి బయటపడేందుకు మార్గాలు
బరువు తగ్గడంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి జీవనశైలి మార్పులు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ని తగ్గించటంలో సహాయపడతాయి.
Non-Alcoholic Fatty Liver : ఊబకాయంచ మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతోపాటు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కేసులు పెరుగుతున్నాయి. కాలేయ కణాలలో అధిక కొవ్వు పేరుకుపోవడం నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కి దారి తీస్తుంది. ప్రారంభ దశలో ఇది ఎటువంటి లక్షణాలను కనిపించవు. తరువాతి దశలలో అలసట, కడుపులో నొప్పి అసౌకర్యం, పొత్తికడుపు వాపు, ఎరుపు అరచేతులు, కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
READ ALSO : Non-Alcoholic Fatty Liver : నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యా? ఎందుకిలా ?
వైరల్ హెపటైటిస్, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ మరియు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లు ఈ మూడు అత్యంత ప్రబలంగా ఉన్న కాలేయ వ్యాధుల రకాలు. A , E వైరల్ హెపటైటిస్ లు, ఇవి ఆహారం ద్వారా సంక్రమిస్తాయి. వీటి వల్ల పెద్దగా హాని ఉండదు. అయితే B, C ,D రక్తం ద్వారా సంక్రమిస్తాయి. చివరకు అవి కాలేయ వైఫల్యం , క్యాన్సర్‌కు కారణమవుతాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అంచనా ప్రకారం భారతదేశంలో వరుసగా 4-5% మరియు 1-2% హెపటైటిస్ బి మరియు సి వల్ల కాలేయ వ్యాధులబారిన పడుతున్నారు.
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే మార్గాలు ;
దీర్ఘకాలిక మరియు ప్రాణాంతకమైన నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ సమస్యను నివారించడానికి వైద్యచికిత్స అవసరం. చికిత్స అనేది వ్యాధి యొక్క తీవ్రత , సంబంధిత సమస్యలపై ఆధారపడి ఉంటుంది.
READ ALSO : Liver Health : లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే రసాయనాలతో పండించిన ఆహారం వద్దు!
1. బరువు తగ్గడం: బరువు తగ్గడం అనేది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నుండి బయటపడటానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి, ముఖ్యంగా ఊబకాయం ఒక ముఖ్యమైన ప్రమాద కారకంగా ఉన్న సందర్భాలలో. బరువు తగ్గడం కాలేయంలో కొవ్వు మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ తో సంబంధం ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
2. జీవనశైలి మార్పులు: బరువు తగ్గడంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి జీవనశైలి మార్పులు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ని తగ్గించటంలో సహాయపడతాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు లీన్ ప్రోటీన్లతో కూడిన ఆహారం నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రెగ్యులర్ వ్యాయామం కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మొత్తం కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
READ ALSO : Amla : లివర్ సమస్యలకు ఉసిరికాయలతో చెక్
3. మందులు: కొన్ని సందర్భాల్లో, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ సమస్యకు వైద్యులు మందులు సూచిస్తారు.. ఉదాహరణకు, పియోగ్లిటాజోన్, విటమిన్ E వంటి మందులు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న రోగులలో కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయని తేలింది. ఈ మందులు మొదటి దశలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న రోగులకు మాత్రమే సిఫార్సు చేయబడతాయి. అదికూడా ఆరోగ్య సంరక్షణ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వారి సూచనమేరకు వాడాల్సి ఉంటుంది.
4. అనుబంధ ఆరోగ్య పరిస్థితుల నిర్వహణ: నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ తరచుగా టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు , హృదయ సంబంధ వ్యాధుల వంటి ఇతర ఆరోగ్య పరిస్థితులతో సంబంధం కలిగి ఉంటుంది. మందులు, జీవనశైలి మార్పులు , సాధారణ పర్యవేక్షణ ద్వారా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ తో సంబంధం ఉన్న సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
READ ALSO : Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్య.. పాటించాల్సిన జాగ్రత్తలు.
5. కాలేయ మార్పిడి: నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ చివరి దశలో కాలేయ మార్పిడి తప్పనిసరి కావచ్చు. కాలేయ మార్పిడి అనేది శస్త్రచికిత్సా ప్రక్రియ, దీనిలో దెబ్బతిన్న కాలేయాన్ని తొలగించి వేరొక దాత నుండి ఆరోగ్యకరమైన కాలేయాన్ని సేకరించి అమరుస్తారు. ఇది సంక్లిష్టమైన, ఖరీదైన ప్రక్రియ, దీనికి జీవితకాలం మందులు, పర్యవేక్షణ అవసరం.
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ సంబంధిత సమస్యలను నివారించడంలో ముందస్తు రోగనిర్ధారణ కీలకం. కాలేయ పనితీరు, సంబంధిత ఆరోగ్య పరిస్థితులను క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయడం, పర్యవేక్షించడం వలన నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ని ప్రాథమిక దశలోనే గుర్తించి దానిద్వారా ఎదురయ్యే సమస్యలను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO : Prevent Liver Damage : కాలేయం దెబ్బతినకుండా నివారించుకోవాలంటే ఎలాంటి ఆహారాలు ఉపయోగకరమంటే ?
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ యొక్క దీర్ఘకాలిక, ప్రాణాంతక కేసులకు నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరం అవుతుంది. చికిత్స ఎంపికలు వ్యాధి యొక్క తీవ్రత, సంబంధిత సమస్యలపై ఆధారపడి ఉంటాయి. బరువు తగ్గడం, మందులు, కాలేయ మార్పిడి, జీవనశైలి మార్పులు అందుబాటులో ఉన్న కొన్ని చికిత్సా మార్గాలు.