Anemia : రక్తహీనతను తొలగించే అంజీరా పండ్లు!

అంజీరాలను రోజువారిగా తీసుకోవటం వల్ల శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. అంతేకాకుండా నీరసం, నిస్సత్తువ, శారీరక బలహీనత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Anemia : రక్తహీనతను తొలగించే అంజీరా పండ్లు!

Figs that remove anemia!

Updated On : December 30, 2022 / 11:47 AM IST

Anemia : శరీరంలో ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గటం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. రక్తహీనత సమస్య ఉన్న వారిలో అలసట, బలహీనంగా ఉండటం, చర్మం పాలిపోవటం, శ్వాస పరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. యుక్తవయస్సులో ఉన్నవారు, బాలురు, బాలికలు, గర్భీణీలలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతుంటే వైద్యులు ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికంగా లభించే ఆహారాలను తీసుకోమని సూచిస్తుంటారు.

రక్తహీనతను తగ్గించే అంజీరాలు ;

రక్తహీనత సమస్యను తగ్గించడంలో అంజీరా పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అంజీరా పండ్లల్లో ఎన్నో రకాల పోషకాలతో పాటు ఫైటో కెమికల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత సమస్య నుండి బయటపడాలంటే అంజీరా పండ్లను రోజువారిగా తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఒక గ్లాస్ పాలల్లో రెండు అంజీరాలను
వేసి బాగా మరిగించాలి. తరువాత పాలను తాగి అంజీరాలను తినాలి. అంజీరాలను ఇలా కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనం రక్తహీనత సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.

అంజీరాలను రోజువారిగా తీసుకోవటం వల్ల శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. అంతేకాకుండా నీరసం, నిస్సత్తువ, శారీరక బలహీనత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభించి పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. అంతేకాకుండా తిన్న ఆహారం త్వరగా జీర్ణమౌతుంది.

అంజీరాలు తీనేవారిలో గ్యాస్, మలబద్దకం తోపాటు జీర్ణ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. రక్తపోటు సమస్య నుండి బయటపడవచ్చు. అంజీరాలో పొటాషియం, సోడియం బాగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి బాగా ఉపకరిస్తాయి. వీటిని తీసుకోవటం వల్ల కడుపు నిండిన భావన కలిగి ఎక్కవ ఆహారం తినలేరు. దీంతో బరువు సులభంగా తగ్గవచ్చు.