Liver Health : కాలేయ ఆరోగ్యానికి తినే తిండి విషయంలో!

కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు ఆకు కూరలను రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలకూర, మెంతికూర, తోటకూర, వంటి ఆకు కూరల్లో గ్లుటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కాలేయం సాఫీగా పనిచేయటానికి ఇందులో ఉండే పీచు ఉపయోగపడుతుంది.

Liver Health : కాలేయ ఆరోగ్యానికి తినే తిండి విషయంలో!

Liver Health

Updated On : June 6, 2022 / 2:46 PM IST

Liver Health : మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో కాలేయం కీలకమైనది. శరీరానికి అవసరమైన ప్రోటీన్, కార్బోహైడ్రేట్లను, జీర్ణక్రియకు అవసరమైన ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆహారంలో లభించే విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లను నిల్వ చేస్తుంది. ఆల్కహాల్, డ్రగ్స్ వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేసి వాటిని శరీరం నుండి విసర్జించే పనిని కాలేయం చేస్తుంది. నిరంతరం పనిచేసే కాలేయం ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కొద్దిపాటి జాగ్రత్తలతో కాలేయ పనితీరును మెరుగుగా ఉంచుకోవచ్చు.

కాలేయం ఆరోగ్యానికి ప్రధాన ముప్పు కలిగించే ఆహారాలుగా జంక్ ఫుడ్స్, చిప్స్ వంటివాటిని చెప్పవచ్చు. ఇవి కాలేయానికి హాని చేస్తాయి. వీటిని తినటం వల్ల కాలేయ పనితీరు మందగిస్తుంది. కాలేయంలో ఉండే కణజాలం గట్టిపడి వాపుకు దారి తీస్తుంది. చక్కెరను మితిమీరి తీసుకోవటం కాలేయానికి శ్రేయస్కరం కాదు. చక్కెరను ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల కాలేయం కొవ్వును ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అది చివరకు ఫ్యాటీ లివర్ సమస్యకు దారి తీస్తుంది.

కాలేయం సిరోసిస్ కు దారి తీయటానికి ఉప్పు కూడా ఒక కారణమని అధ్యయనాల్లో తేలింది. సోడియం ఎక్కువగా ఉండే ఆహారం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇంట్లో వండుకునే ఆహారాల్లో ఉప్పు మోతాదు తగ్గించుకోవటం ద్వారా కాలేయానికి మేలు కలుగుతుంది. మద్యం అలవాటు ఉంటే అది కాలేయ ఆరోగ్యానికి ఇబ్బందిని కలిగిస్తుంది. అతిగా మద్యం సేవించే వారిలో కాలేయ పనితీరు దెబ్బతింటుంది.

కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు ఆకు కూరలను రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలకూర, మెంతికూర, తోటకూర, వంటి ఆకు కూరల్లో గ్లుటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కాలేయం సాఫీగా పనిచేయటానికి ఇందులో ఉండే పీచు ఉపయోగపడుతుంది. నట్స్ ను తీసుకోవటం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. బాదంపప్పు వంటి వాటిలో ఉండే విటమిన్ ఇ కాలేయానికి కొవ్వు పట్టకుండా చూస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవటం మంచిది. శీతలపానీయాలకు బదులుగా అధిక మోతాదులో నీరు సేవించటం వల్ల బరువును అదుపులో ఉంచుకోవటంతోపాటు కేలరీలను తగ్గించుకోవచ్చు. బ్రకోలి కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది.