Constipation Problem : మలబద్ధకం సమస్యకు ఆసనంతో పరిష్కారం

మలబద్ధకం సమస్యను పోగొట్టుకునేందుకు మూలాసనం చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుంది. ఈ ఆయసనం వేయటం వల్ల కడుపులో ప్రోగుబడి ఉన్న మలం కదిలికలకు

Constipation Problem : మలబద్ధకం సమస్యకు ఆసనంతో పరిష్కారం

Exercises1

Updated On : August 23, 2021 / 4:09 PM IST

Constipation Problem : మలబద్దకం సమస్య ప్రస్తుతం అందరిని వేధిస్తున్న సమస్య, ఈ సమస్యతో చిన్న వయస్సు వారి నుండి పెద్ద వయస్సు వారి వరకు అందరిని ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. ఇలాంటి సమయంలో విరేచనం గట్టిగా ఉండటం, విరేచనం సమయంలో ముక్కాల్సి రావటం వంటి పరిస్ధితులు ఎదురవుతాయి. అంతేకాదు. మలబద్దకం కారణంగా శరీరంలో అనేక పరిణామాలు సంభవిస్తాయి. కడుపు ఉబ్బరంగా ఉండటం, తీవ్రమైన తలనొప్పి, కడుపులో నొప్పి కలగటం వంటివి సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఇలాంటి సందర్భంలో చికాకు అనిపించటం, ఎవరైనా ఏదైన చెప్తే విసుక్కోవటం వంటివి సాదరణమైన లక్షణాలు.

ఈ మలబద్దకం సమస్యకు ముఖ్యకారణం మన ఆహారపు అలవాట్లనే చెప్పాలి. చాలా మంది సరైన ఆహారం తీసుకోకపోవటం వల్లే ఈ తరహా సమస్య వస్తుంది. ఫైబర్ ఎక్కవగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, నట్స్ వంటివి ఆహారంగా తీసుకోవాలి. మలబద్దక సమస్యకు నీరు సరిగా తాగకపోవటం కూడా కారణం కావచ్చు. రోజుకు 8గ్లాసు నీరు తప్పనిసరిగా తాగేలా చూసుకోవాలి.

మలబద్ధకం సమస్యను పోగొట్టుకునేందుకు మూలాసనం చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుంది. ఈ ఆయసనం వేయటం వల్ల కడుపులో ప్రోగుబడి ఉన్న మలం కదిలికలకు గురై సుఖ విరేచనానికి వీలవుతుంది. ఈ ఆసనాన్నే గార్లాండ్ ఫోజ్ అని కూడా అంటారు. ముందు నిటారుగా నిలబడాలి. అతారువాత కాళ్ళను దూరంగా పెట్టాలి. వంగి చేతులను నేలపై ఆనించి మోకాళ్ళను వంచి కూర్చోవాలి. రెండు చేతులతో నమస్కారం చేస్తున్న భంగిమలో 2 నిమిషాలపాటు ఉండాలి.

ప్రతిరోజు ఈ భంగిమలో ఆసనం వేయటం వల్ల మలబద్దకం సమస్యకు చెక్ చెప్పవచ్చు. ఈ ఆసనం వేయటం వల్ల శరీరంలోని మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరిగిపోయి అధిక బరువు తగ్గిపోతారు. తొడ కండరాలు గట్టిపడటంతోపాటు జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. కీళ్ళనొప్పులు ఉన్న వారు ఈ ఆసనం వేయకపోవటమే మంచిది.