Muscle Building : కండరాల నిర్మాణం కోసం?..
కండలు పెంచాలనుకునే వారు జంక్ ఫుడ్, చక్కెరలు, పిండి పదార్థాలు, కొవ్వులు ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవటం సరైనది కాదు. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.

Muscle Building
Muscle Building : శరీరం దృఢంగా, బలమైన కండరాలు కలిగి ఉండాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఇందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆరోగ్యకరమైన పద్దతిలో కండరాల నిర్మాణం జరగాలంటే మాత్రం మంచి ఆహారం, దానికి తగ్గట్టుగా వ్యాయామాలను ఎంపిక చేసుకోవటం అవసరం. ప్రధానంగా కండ పుష్టి విషయంలో రాత్రి,పగలు జిమ్ చేస్తే సరిపోదు దానికి తగ్గట్టుగా కొన్ని రకాల ఆహారాలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. కండరాల నిర్మాణానికి దోహదపడే ఆహారాలను తీసుకోవటం అవసరం.
కండలు పెంచాలనుకునే వారు జంక్ ఫుడ్, చక్కెరలు, పిండి పదార్థాలు, కొవ్వులు ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవటం సరైనది కాదు. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అధిక క్యాలరీల ఆహారం తీసుకోవటం వల్ల శక్తి లభించే సంగతి అంటుంచి కొవ్వులు చేరటానికి అవకాశం ఏర్డపుతుంది. కండరాల నిర్మాణంకోసం వ్యాయామాలు అధికంగా చేసేవారికి ప్రొటీనులు అవసరత ఎంతో ఉంది. ప్రొటీన్ ఆహారం తీసుకోవటం వల్ల అది శరీరంలో అమైనో ఆసిడ్స్ గా విభజితమై చివరికి శక్తిగా మారి రోజు వారి వ్యాయామాలు చేయటానికి తగిన శక్తిని అందిస్తుంది. కార్బోహైడ్రేట్స్, ప్రొటీనుల కాంబినేషన్ తో కూడిన ఆహారం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కండరాలు పెంచుకోవాలనుకునే వారు శరీర బరువులో ఒక కిలోకు రోజుకు 1.2 గ్రాముల ప్రొటీను తీసుకోవటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు అవసరమైన ప్రొటీన్ లో 40శాతం వ్యాయామాలు చేశాక శరీరానికి అందించగలిగితే కండరాల నిర్మాణం మెరుగుపరుచుకోవచ్చు. ఎంత ప్రొటీన్ రోజువారిగా తీసుకుంటున్నామో అవగాహన కలిగి ఉండటం మంచిది. గుడ్లు, చేపలు, చికెన్, పాలు, పాల ఉత్పత్తులు, నట్స్, విత్తనాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావల్సిన ప్రోటీన్లను అందిస్తాయి. తాజా పండ్లు, కూరగాయలను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతోపాటు నెయ్యి, కొబ్బరినూనెలను కూడా తీసుకోవచ్చు. ఉదయం సమయంలో వాల్ నట్స్ ను , తృణ ధాన్యాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తింటే కండరాలు పెరుగుతాయి. ఇవి మంచి పోషణను, శక్తిని అందిస్తాయి. శరీరం దృఢంగా మారేలా చేస్తాయి.