Garlic : వర్షకాలంలో వచ్చే వ్యాధుల నుండి రక్షణగా వెల్లుల్లి!

వర్షకాలంలో బాక్టీరియా, వైరస్‌ల కారణంగా అనేక వ్యాధులు వస్తుంటాయి. అంతేకాకుండా ఫుడ్ పాయిజనింగ్ వల్ల విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు కలుగుతాయి. వీటన్నింటికీ వెల్లుల్లి చక్కని పరిష్కారం.

Garlic : వర్షకాలంలో వచ్చే వ్యాధుల నుండి రక్షణగా వెల్లుల్లి!

Garlic

Updated On : June 10, 2022 / 4:37 PM IST

Garlic : వర్షాకాలం ప్రారంభం కాబోతుంది. వేడి వాతావరణం నుండి ఒక్కసారిగా చల్లని వాతావరణంలోకి మారబోతున్నాం. ఈ సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వీటి నుండి రక్షణ పొందాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవటం చాలా అవసరం. వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవటంతోపాటు, కొన్ని రకాల చిట్కాలను కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఆయుర్వేదపరంగా ఇంట్లో లభించే కొన్ని రకాల పదార్ధాలు మనలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. అల్లాంటి వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి. ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంతగానో మేలు చేస్తుంది.

వెల్లుల్లి సెలీనియం, జింక్, రాగి, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B5, మరియు బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలు, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు వంటి ఇతర ముఖ్యమైన ఖనిజాలు , పోషకాలను కలిగి ఉంటుంది. మంచి మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ , తక్కువ పరిమాణంలో కొవ్వులతో, కేలరీలు తక్కువగా ఉంటుంది. రోజూ ఉదయాన్నే పరగడుపున రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి మింగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది. చాలా మంది తినేందుకు చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకుంటే సరిపోతుంది. వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు, విష జ్వరాలు వంటివి రాకుండా చూస్తుంది. ఒక వేళ వచ్చినా శరీరానికి వెల్లుల్లి ద్వారా లభించే రోగనిరోధక శక్తితో వాటి నుండి సులభంగా బయటపడవచ్చు.

వర్షకాలంలో బాక్టీరియా, వైరస్‌ల కారణంగా అనేక వ్యాధులు వస్తుంటాయి. అంతేకాకుండా ఫుడ్ పాయిజనింగ్ వల్ల విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు కలుగుతాయి. వీటన్నింటికీ వెల్లుల్లి చక్కని పరిష్కారం. ఎందుకంటే వెల్లుల్లిలో ఉండే యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరల్ గుణాలు వాటిని దరిచేరకుండా చూస్తాయి. వెల్లుల్లి జీర్ణవ్యవస్థలో ఉండే క్రిములను నశింపచేస్తాయి. దీంతో జీర్ణ సమస్యలు ఉత్పన్నంకాకుండా చూడవచ్చు.

ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల గుండె మరియు శరీరంలోని ఇతర అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది క్రమంగా, గుండెపోటు లేదా రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల కలిగే సమస్యల వంటి గుండె పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌, బీపీ అదుపులో ఉంచుకోవటంతోపాటు, గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు. అధిక రక్తపోటును నివారిస్తుంది. వెల్లుల్లి ఉత్పన్నమైన ఆర్గానిక్ పాలిసల్ఫైడ్‌లు ఎర్ర రక్త కణాల ద్వారా హైడ్రోజన్ సల్ఫైడ్‌గా మార్చబడతాయి, ఇది గుండె కండరాన్ని సడలించి రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుంది.

అందుకే ఆరోగ్యం కోసం పరగడుపున కనీసం ఒక రెబ్బనైనా వెల్లుల్లిని నమిలితినటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంత మంది వెల్లుల్లి వాసన పడదు. దానిని తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారు సప్లిమెంట్ రూపంలో తీసుకునేందుకు వైద్యులను సంప్రదించటం మంచిది.