Besan : కిచెన్ హీరో.. దీనివల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?

శనగపిండి లేకపోతే వంటిల్లు అసంపూర్ణమని చెప్పాలి. స్నాక్స్ నుంచి స్వీట్స్ తయారీ వరకూ శనగపిండి ఎంతో అవసరం. అందానికి, ఆరోగ్యానికి కావాల్సిన అనేక పోషకాలు శనగపిండిలో ఉన్నాయి. అవేంటో చదవండి.

Besan : కిచెన్ హీరో.. దీనివల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?

Besan

Updated On : September 3, 2023 / 7:09 PM IST

Besan : వంటింట్లో శనగపిండి లేకపోతే చాలా కష్టం. వంటల్లో, స్నాక్స్‌లో, బ్యూటీ ప్యాక్‌లలో ఇది ఎంతో అవసరం. శనగపిండి లేని వంటిల్లు అసంపూర్ణమని చెప్పాలి.

Black Grapes : జుట్టు, చర్మ ఆరోగ్యానికి నల్ల ద్రాక్ష వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

సాయంత్రం కాగానే వేడి వేడిగా పకోడీలు తినాలనిపిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా బేసన్ అదే శనగపిండి ఖచ్చితంగా కావాలి. దీనిలో అనేక పోషకాలు ఉన్నాయి. ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంతో పాటు జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ ఫుడ్. అంటే ఇది తినడం వల్ల బ్లడ్‌లో సుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగడానికి దారి తీయదు.

International kissing day 2023 : ముద్దులు .. ఆరోగ్య ప్రయోజనాలు, మానసిక, శారీరక ఆరోగ్యాల రహస్యాలు

శనగపిండితో పకోడీలు, లడ్డూలు, మైసూర్ పాక్, సోంపాపిడి వంటి అనేక స్వీట్ల తయారీలో వాడతారు. శనగపిండి స్కిన్‌కి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మొటిమలు నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్కిన్‌ని బట్టి తేనె, నిమ్మకాయ, చందనం, రోజ్ వాటర్, ముల్తానీ మిట్టి వంటి ఇతర పదార్ధాలతో బేసన్‌ని కలిపి ఫేస్ ప్యాక్‌లకు సిద్ధం చేసుకోవచ్చు. ప్యాక్ అప్లై చేసిన తరువాత 30 నిముషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. చర్మం కాంతివంతంగా, మృదువు తయారవుతుంది.