గుమ్నామీ బాబా నేతాజీ కాదు.. ఆయన అనుచరుడు

ఎన్నోఏళ్లుగా తాను స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ నమ్మిస్తూ వచ్చిన గుమ్నామీ బాబా అలియాస్ భగవాన్ జీ అసలైన నేతాజీ కాదని తేలిపోయింది.

  • Published By: sreehari ,Published On : December 20, 2019 / 01:54 PM IST
గుమ్నామీ బాబా నేతాజీ కాదు.. ఆయన అనుచరుడు

Updated On : December 20, 2019 / 1:54 PM IST

ఎన్నోఏళ్లుగా తాను స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ నమ్మిస్తూ వచ్చిన గుమ్నామీ బాబా అలియాస్ భగవాన్ జీ అసలైన నేతాజీ కాదని తేలిపోయింది.

ఎన్నోఏళ్లుగా తాను స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ నమ్మిస్తూ వచ్చిన గుమ్నామీ బాబా అలియాస్ భగవాన్ జీ అసలైన నేతాజీ కాదని తేలిపోయింది. ఆయన కేవలం నేతాజీ చంద్రబోస్ అనుచరుడు మాత్రమేనని లక్నో రిటైర్డ్ జస్టీస్ విష్ణు సహాయ్ కమిషన్ తేల్చేసింది. గుమ్నామీ బాబాకు సంబంధించిన నిజాలను  రాబట్టేందుకు యూపీ ప్రభుత్వం నియమించిన జస్టిస్ విష్ణు సహాయ్ కమిషన్ తన నివేదికను గురువారం అసెంబ్లీలో సమర్పించింది.

గుమ్నామీ బాబా గొంతు.. నేతాజీ చంద్రబోస్ గొంతును పోలి ఉందని కమిషన్ పేర్కొంది. 1985 సెప్టెంబర్ 16న గుమ్నామీ బాబా మరణించారు. కొన్ని రోజుల తర్వాత ఆయన భౌతిక కాయానికి సెప్టెంబర్ 18న అయోధ్యలోని గుప్తార్ ఘాట్‌లో దహన సంస్కారాలు నిర్వహించారు. గుమ్నామీ బాబాయే నేతాజీ చంద్రబోస్‌గా ఎంతోమంది నమ్మేవారు. 

గుమ్నామీ బాబా మరణించే వరకు ఆయన నివసించిన ఫైజాబాద్(ఇప్పటి అయోధ్య)లోని రాం భవన్‌లో కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు కమిషన్ తెలిపింది. ఆ వస్తువులు నిశితంగా పరిశీలించిన అనంతరం ఆయన నేతాజీ చంద్రబోస్ గా నిర్ధారించలేకపోయినట్టు కమిషన్ వెల్లడించింది.

గుమ్నామీ బాబాజీ కేవలం చంద్రబోస్ అనుచరుడు మాత్రమేనని జస్టిస్ సహాయ్ కమిషన్ 130 పేజీల రిపోర్టులో తేల్చేసింది. ఆయన నేతాజీ అనుచరుడని చెప్పడానికి 11 అంశాలను కమిషన్ చూపించింది. గుమ్నామీ బాబా నేతాజీ అనుచరుడు. ఇతన్నీ చూసిన ప్రజలంతా నేతాజీ అంటూ పిలవడంతో అక్కడి నుంచి మకాం మార్చేసేవాడు. 

గుమ్నామీ బాబాకు బెంగాలీ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉంది. అంతేకాదు.. యుద్ధం, వర్తమాన రాజకీయాలపై లోతైన అవగాహన ఉన్నట్టు గుర్తించింది. గుమ్నామీ బాబా అసలైన నేతాజీయేనా అని తేల్చే విషయంలో జనవరి 31, 2013లో చంద్రబోస్ మేనకోడలు, సుభాష్ చంద్ర బోస్ రాష్ట్రీయ విచార్ కేంద్రం అలాహాబాద్ హైకోర్టులో రెండు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ రెండెంటిపై విచారించిన కోర్టు సహాయ్ కమిషన్ ఏర్పాటుకు ఆదేశాలు జారీచేసింది. అప్పటినుంచి దీనిపై విచారించి ఆధారాలను సేకరించిన జస్టీస్ సహాయ్ కమిషన్ అందరు నమ్మినట్టుగా ఆయన నేతాజీ చంద్రబోస్ కాదని కొట్టిపారేసింది.