గుడ్ ఫుడ్: పోషకాల గని వేరుశనగ

  • Published By: veegamteam ,Published On : May 6, 2019 / 06:13 AM IST
గుడ్ ఫుడ్: పోషకాల గని వేరుశనగ

Updated On : May 6, 2019 / 6:13 AM IST

వేరుశనగల్ని రాత్రిపూట నానబెట్టి, నెక్స్ట్ డే ఉదయం ఉప్పునీళ్లలో ఉడికించుకుని తింటే ఆహా.. ఆ టేస్టే వేరు కదా. వేరుశనగలు లేదా పల్లీలు రుచిలోనే కాదు, ఆరోగ్యాన్నివ్వడంలో కూడా ముందుంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్థుల నుంచి గుండెజబ్బులున్నవాళ్ల దాకా వేరుశనగలు మంచి మేలు చేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. 

* బాదం, పిస్తా లాంటి నట్స్ లో కన్నా కూడా వేరుశనగల్లో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. మహిళలకైతే ఇవి పోషక భాండాగారాలే. మహిళల ఆరోగ్యానికి ఇనుము, ఫోలిక్ ఆమ్లం చాలా ఇంపార్టెంట్. ఈ రెండు పోషకాలే కాకుండా ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం కూడా పల్లీల్లో ఎక్కువే

* ప్రతిరోజూ 30 గ్రాముల వేరుశనగలు తీసుకుంటే గుండె కవాటాలను కాపాడుకున్నవాళ్లవుతారని సూచిస్తున్నారు నిపుణులు. వీటిలోని యాంటి ఆక్సిడెంట్స్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. మెదడును ఉత్తేజితం చేసి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పిల్లలు, వృద్ధులు వేరు శనగల్ని తీసుకోవడం ద్వారా ఎముకల వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. 

* గుప్పెడు వేరుశనగలతో డయాబెటిస్ ను కూడా దూరం చేసుకోవచ్చు. అందుకే ప్రత్యేకించి డయాబెటిస్ ఉన్నవాళ్లు రోజూ వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్న వేరుశనగల్ని ఇక రోజూ తీసుకోండి మరి.