Dengue Recovery Diet : డెంగ్యూతో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిందా ? పెంచుకునేందుకు చేయాల్సింది ఇదే !
తాజా పండ్లు బొప్పాయి, కివీ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను తీసుకోవాలి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇవి ప్లేట్‌లెట్ కౌంట్‌ను బాగా పెంచుతాయి. ఈ పండ్లోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు, వ్యాధిని తగ్గించేందుకు సహాయపడుతుంది.

Dengue Recovery Diet
Dengue Recovery Diet : శీతాకాలం ప్రారంభమైంది. ఈ సీజన్ లో వైరల్ ఫీవర్స్ అధికంగా ఉంటాయి. ఎందుకంటే దోమల వృద్ధి కారణంగా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వ్యాప్తికి కారణమవుతాయి. గత రెండు, మూడు నెలలుగా డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వైరల్ ఫీవర్ కేసులు అధిక సంఖ్యలో పెరుగుతున్నాయి. డెంగ్యూ జ్వరాన్ని గుర్తించిన వెంటనే సరైన చికిత్స అందించాలి. లేదంటే కొన్ని సందర్భాల్లో ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
READ ALSO : Diet For Dengue : డెంగ్యూ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు
ముఖ్యంగా డెంగ్యూ కేసుల్లో ప్లేట్‌లెట్స్ కౌంట్ పడిపోవటం జరుగుతుంది. దీని వల్ల అంతర్గత అవయవాల్లో రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది మనిషి ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. అందుకే డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే, వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సమక్షంలో చికిత్స పొందాలి. అలాగే తగ్గిన ప్లేట్ లెట్స్ సంఖ్యను పెంచుకునేందుకు ఆహారంలో అనేక మార్పులు చేయాలి. ప్లేట్‌లెట్స్ కౌంట్‌ను పెంచేందుకు ఇవి తోడ్పడతాయి.
డెంగ్యూ రోగుల్లో ప్లేట్ లెట్స్ కౌంట్ ను పెంచే ఆహారాలు ;
తాజా పండ్లు బొప్పాయి, కివీ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను తీసుకోవాలి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇవి ప్లేట్‌లెట్ కౌంట్‌ను బాగా పెంచుతాయి. ఈ పండ్లోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు, వ్యాధిని తగ్గించేందుకు సహాయపడుతుంది. అలాగే హైడ్రేటెడ్‌గా ఉండేందుకు సహాయపడతాయి. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను కాపాడుకోనేందుకు, శరీరం నుంచి వ్యర్ధాలను బయటకు పంపడానికి వాటర్, కొబ్బరి నీరు, హెల్తీ సూప్స్ వంటివి తాగడం మంచిది.
దానిమ్మ పండ్లు, జ్యూస్ (పంచదార లేకుండా) సేవిస్తే ప్లేట్‌లెట్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవాలంటే ఈ పండ్లను కచ్చితంగా తీసుకోవాలి. ఆకు కూరలు ఈ సమయంలో ఆరోగ్యానికి , త్వరగా కోలుకోవటానికి బాగా ఉపకరిస్తాయి. పాలకూర, కాలే వంటి ఆకు కూరలు ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా వ్యాధుల నుంచి త్వరగా బయటడటానికి సహాయపడతాయి.
ఫ్లూయిడ్ రిచ్ ఫుడ్స్ పుచ్చకాయ, దోసకాయలు వంటి వాటిలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇలాంటి ఆహారాలు డీహైడ్రేషన్‌ను దూరం చేయటంతోపాటు, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేస్తాయి. వేరుజాతికి చెందిన కూరగాయలను ఆహారంలో తీసుకుంటే వేగంగా బరువు తగ్గడానికి సహాయపడినట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ఈ కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అధిక మొత్తంలో పీచుపదార్థం ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది.
READ ALSO : Dengue Cases : దేశవ్యాప్తంగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు.. సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆరోగ్యకరమైన కొవ్వులను అందించే అవకాడోలు, నట్స్, సీడ్స్, ఆలివ్ నూనె వంటివాటిని ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. డెంగ్యూ నుండి కోలుకునేందుకు , శారీరక వ్యవస్థలను ఆరోగ్యంగా మార్చటంలో దోహదం చేస్తాయి. అల్లం, పసుపు ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ మసాలులు శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తూ, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడకుండా చూసుకోవచ్చు. ఎనర్జీ లెవల్స్ బ్యాలెన్స్ చేయవచ్చు.
జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. డెంగీ నుంచి కోలుకునే సమయంలో ప్రాసెస్డ్, ఫ్రై ఫుడ్స్ వంటి వాటిని తినరాదు. వీటిని తీసుకోవటం వల్ల కేలరీలు, చెడు కొవ్వులు శరీరంలో చేరి, తిరిగి వ్యాధిని తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. డెంగ్యూ నుండి పూర్తిగా కోలుకున్న తరువాత మాత్రమే మాంసం, గుడ్లు వంటి ప్రోటీన్ ఫుడ్ తినాలి. వైద్యుల సలహాతో చికెన్, చేపలు, కాయధాన్యాలు వంటి వాటిని తీసుకోవాలి.
READ ALSO : Dengue Fever : డెంగ్యూ కల్లోలం… ఇలా చేస్తే డేంజర్ కాదు
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.