Figs : అంజీరాలతో ఆరోగ్యం!
ఉదయాన్నే పరగడుపునే అంజీర్ పండ్లలను తింటే శరీరానికి చలువ చేస్తుంది. వేడి తగ్గుతుంది. అంజీర్ పండ్లను తినడం వల్ల శృంగార సమస్యలు తొలగిపోతాయి. నిద్రలేమి సమస్యను పోగొట్టుకోవచ్చు. వీటిని తినటం వల్ల నిద్ర బాగా పడుతుంది.

Figs
Figs : అంజీర్ పండ్లు మనకు పండు రూపంలో, డ్రై ఫ్రూట్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే ఏ రూపంలో వీటిని తిన్నాఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు కలిగిస్తాయి. అంజీరా పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. అంజీర్ పండ్లలో విటమిన్ ఎ, బి1, బి2, కాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
మలబద్ధకాన్ని నివారించటంలో సహయపడుతుంది. అంజీర్ పండ్లలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యలను పోగొడుతుంది. రక్తం వృద్ధి చెందుతుంది. అధిక రక్తపోటని అదుపులో ఉంచుతుంది. శరీరంలో సోడియం నిల్వలు పెరిగినప్పుడు సోడియం, పొటాషియం సమతుల్యత దెబ్బతింటుంది. ఈసమయంలో అంజీరా పండ్లు బాగా ఉపకరిస్తాయి. వీటిలో అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శరీరంలోని హానికర వ్యర్ధాలను తొలగిస్తాయి. గుండె పోటుకి కారణమయ్యే ట్రైగ్లిజరాయిడ్లను తగ్గిస్తాయి.
ఉదయాన్నే పరగడుపునే అంజీర్ పండ్లలను తింటే శరీరానికి చలువ చేస్తుంది. వేడి తగ్గుతుంది. అంజీర్ పండ్లను తినడం వల్ల శృంగార సమస్యలు తొలగిపోతాయి. నిద్రలేమి సమస్యను పోగొట్టుకోవచ్చు. వీటిని తినటం వల్ల నిద్ర బాగా పడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా నియంత్రిస్తాయి. అధిక బరువును నియంత్రించటంలో సహాయపడతాయి.
జుట్టు రాలటాన్ని అంజీరా నివారిస్తాయి. శ్వాసకోశ సమస్యలు తొలగుతాయి. ఈ పండులో ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే అంజీరా పండ్లను పరిమితంగానే తీసుకోవాలి. అతిగా తింటే మాత్రం కొన్ని అనర్ధాలు కలుగుతాయి. అంజీర్ పండ్లను పరిమితికి మించి తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, వంటి సమస్యలు తలెత్తుతాయి.