Reduce Weight : అధికబరువును తగ్గించే వేడి నీళ్లు
డయాబెటిస్, షుగర్ వ్యాధి సమస్యతో బాధపడేవారు వేడినీళ్లు తాగితే శరీరం ఉత్తేజితమౌతుంది. వేడి నీటిని తాగటం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.

Cold Water
Reduce Weight : వేడి నీరు తాగటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మధుమేహం, గుండె జబ్బులు, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి వేడి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. రోగాలను దరి చేరనివ్వకుండా శరీరాన్నికాపాడుతాయి. రాత్రి ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే వేడి నీళ్లు తాగడం మంచిదంటున్నారు నిపుణులు. వేడి నీళ్లు తాగటం వల్ల సుఖవంతంగా నిద్రపడుతుంది. మానసిక ఒత్తిడిని, నిద్ర లేని సమస్యల నుండి బయటపడేందుకు వేడినీరు ఎంతగానో ఉపకరిస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు రోజు వేడి నీరు తీసుకోవటం వల్ల సులభంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
శరీరంలో అధిక మోతాదులో ఉన్న కొవ్వులను తగ్గించటంలో వేడి నీళ్ళను మించింది లేదు. కడుపు నొప్పి,తిన్నది అరగని జీర్ణ సమస్యలు ఉన్నసమయంలో వేడినీళ్ళు మంచి ఔషదంగా పనిచేస్తాయి. మలబద్దక సమస్యతో బాధపడుతుంటే రోజులో రెండు సార్లు వేడినీరు తాగటం వల్ల సాఫీగా విరోచనం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. గొంతు సమస్యలు, జలుబు, న్యూమోనియా వంటి వాటిని దరిచేరకుండా ఉండేందుకు దోహదపడతాయి. ఎండాకాలంలో డిహైడ్రేడ్ సమస్య తీర్చేందుకు వేడి నీరు ఉపయోగపడుతుంది. వేడి నీళ్లు రక్త ప్రసరణ పెంచడంతోపాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.
డయాబెటిస్, షుగర్ వ్యాధి సమస్యతో బాధపడేవారు వేడినీళ్లు తాగితే శరీరం ఉత్తేజితమౌతుంది. వేడి నీటిని తాగటం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కండరాలు, కీళ్లకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. భవిష్యత్తులో డయాబెటిస్ ముప్పు రావచ్చన్న ఆందోళనలో ఉన్నవారు ఇప్పటి నుండి గోరువెచ్చగా ఉండే నీటిని తీసుకోవటం వల్ల కొంతమేర డయాబెటీస్ రాకుండా అడ్డుకోవచ్చు. ఉదయం నిద్ర లేవ గానే కాలకృత్యాలు తీర్చుకోక ముందే రెండు లేదా మూడు గ్లాసులు గోరు వెచ్చని నీళ్లు తాగంటం వల్ల ప్రయోజనం ఉంటుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఇలా అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది.