Coconut Water : వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంత మంచిదంటే!.
వేసవి తాపంలో కూల్ డ్రింక్ కోసం తహతహలాడే ఫిట్‌నెస్ ప్రేమికులందరికీ ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు తాగటం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Oconut Water
Coconut Water : వేసవిలో కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే అద్భుతమైన లక్షణం కొబ్బరి నీటిలో ఉంది. వేసవి కాలంలో దాహం అధికంగా ఉంటుంది. చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది.. దీంతో చాలామంది కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతారు. అయితే కూల్ డ్రింక్స్ తాగటం ఆరోగ్యపరంగా అంత శ్రేయస్కరం కాదు. అయితే సహజసిద్ధంగా ప్రకృతిలో లభించే కొబ్బరి నీరు సేవించటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వేసవిలో శరీరానికి కొబ్బరినీటి వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది.
కొబ్బరినీటిలో సహజ విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి హైడ్రేషన్‌కు సహాయపడతాయి. వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే కొబ్బరి నీరు తాగాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కడుపులో మంట అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో భాదపడేవారు తరచు కొబ్బరి నీరు తాగితే మంచిది. కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం, సోడియం ఆల్కలైన్ సమతుల్యతను క్రమబద్ధీకరించి రక్తపోటును తగ్గిస్తుంది. ఈ వాటర్‌లో ఉండే సహజ ఎలక్ట్రోలైట్ మిమ్మల్ని రిఫ్రెష్‌గా, హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరం సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి బయటపడాలంటే కొబ్బరి నీరు తాగడం మంచిది.
వేసవిలో పండ్ల రసాలకు బదులు కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. కొబ్బరి నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఎసిటమైనోఫెన్ వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగవుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తుతులు కొబ్బరి నీరు తాగటం వల్ల మేలు కలుగుతున్నప్పటికీ తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి పిల్లలను కాపాడుతుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీటిలోని కాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతాయి. కండరాలు బలోపేతం చేస్తాయి.
బరువు తగ్గాలనుకునే వారికి కొబ్బరినీరు బాగా ఉపయోగపడతాయి. సెల్ఫ్ న్యూట్రిషన్ డేటా ప్రకారం, ఒక కప్పు కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, ఫైబర్ మరియు మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, మాంగనీస్ , సోడియం వంటి మినరల్స్ ఆరోగ్యకరమైన మోతాదుతో పాటు 46 కేలరీలు ఉంటాయి. వేసవి తాపంలో కూల్ డ్రింక్ కోసం తహతహలాడే ఫిట్‌నెస్ ప్రేమికులందరికీ ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు తాగటం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కొబ్బరిలో ఉండే సైటోకినిన్స్ వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తాయి. కొబ్బరి నీరు వ్యాయామం తర్వాత తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి మన ఆరోగ్యానికి, చర్మానికి చాలా ఉపయోగకరంగా చెప్పవచ్చు. కొబ్బరిలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఇందులో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో 95 శాతం నీరు ఉంటుంది. శరీరంలో నీటి కొరత ఉండదు. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నవారు కొబ్బరి నీరు త్రాగేముందు వైద్యుని సూచనలు, సలహాలు పాటించటం మంచిది.