Care COVID Positive Person : మీ ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే… ఇలా జాగ్రత్తగా అతన్ని చూసుకోవాలి
మీ కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే.. ఇంట్లో వారి ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీతో పాటు ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులను వైరస్ బారిన పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

Covid Positive Family Member (2)
How Care for COVID Positive Person : మీ కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే.. ఇంట్లో వారి ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీతో పాటు ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులను వైరస్ బారిన పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు వైద్య నిపుణులు. కుటుంబంలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నా లేదా కరోనా సోకినట్టు నిర్ధారణ అయినా కచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అలాగే కరోనా సోకిన వ్యక్తిని చూసుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు.
అలాగే కరోనా సోకి లక్షణాలు లేనివారి విషయంలోనూ తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారిలో కరోనా తీవ్ర ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కరోనా తీవ్ర లక్షణాలు మొదలైన వెంటనే వైద్యసాయం తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ICMR, WHO గైడ్ లైన్స్ తప్పనిసరిగా ఫాలో కావాలని సూచిస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తికి సాయం చేసే కుటుంబ సభ్యులు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి చూద్దాం..
బాధితులకు సపోర్టు అందించాలి :
కరోనా సోకిన బాధితుడికి వైద్యుడు సూచనలను జాగ్రత్తగా పాటించాలి. అలాగే అవసరమైన మందులను సమయానికి ఇచ్చేలా చూడాలి. దగ్గర ఎప్పుడూ ఆక్సీమీటర్ ఉండేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడూ ఆక్సిజన్ స్థాయిలను ట్రాక్ చేస్తుండాలి. సాధారణంగా ఆక్సీజన్ స్థాయి 94శాతం పైబడి ఉండాలి. జ్వరం వంటి ఇతర ఒళ్లు నొప్పులు ఉంటే వైద్యులు సూచించిన మందులు వేసుకోవాలి. ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. విశ్రాంతి తప్పక తీసుకోవాలి. దగ్గు, తుమ్ములు వస్తే.. మోచేతి అడ్డుగా పెట్టుకోవాలి. లేదంటే డిస్పోజల్ టిష్యూ అడ్డుపెట్టుకుని వాడిన తర్వాత వెంటనే పారేయాలి. ఒకే రూంలో ఉండాల్సి వచ్చినప్పుడు వైరస్ సోకిన వ్యక్తి తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
వైరస్ లక్షణాలను గమనించాలి :
కరోనా సోకిన వ్యక్తిలో వైరస్ లక్షణాలను గమనిస్తుండాలి. అత్యవసర వైద్యం కోసం ముందుగానే డాక్టర్ ఫోన్ నెంబర్ దగ్గర పెట్టుకోవాలి. అవసరమైన వైద్య సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వ సెల్ఫ్ చెకర్ టూల్ సాయం తీసుకోవాలి. కరోనా ఎమర్జెన్సీ తీవ్ర లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేయాలి. శ్వాస తీసుకోలేకపోవడం, ఛాతి నిరంతర నొప్పి, లేవలేకపోవడం, లేచి నిలబడలేకపోవడం, చర్మం పాలిపోవడం, బూడిద రంగులోకి మారడం లేదా చర్మం నీలం రంగులోకి మారడం, పెదాలు, గోళ్లు రంగు మారడం, చర్మం రంగు ఆధారంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తక్షణమే ఎమర్జెన్సీ మెడికల్ కేర్ సాయం తీసుకోవాలి.
ఇతరులతో పరిమితంగానే కలవాలి :
కరోనా వైరస్ సోకిన వ్యక్తి.. ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉండాలి. అవసరమైతే సపరేట్ బెడ్ రూం, బాత్ రూం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. వీలైతే కుటుంబ సభ్యులకు దూరంగా ఒక గదిలో ఐసోలేషన్ కావాలి. వైరస్ సోకిన వ్యక్తి నుంచి కనీసం 6 అడుగుల దూరంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏ వస్తువులు షేర్ చేయొద్దు :
వైరస్ సోకిన వ్యక్తి వాడే ఏ వస్తువులను ఇతరులు వాడరాదు. బాధితులు వాడే రూంలో ఫ్రెష్ ఎయిర్ వచ్చేలా జాగ్రత్త తీసుకోవాలి. కిటికిలు తెరిచి ఉంచాలి. బయటి గాలి లోపలికి వచ్చి వెంటిలేషన్ మెరుగుపడుతుంది. హానికర వైరస్ తుంపర కణాలు గాల్లో నుంచి తొలగిపోతాయి. ఇంటికి అనవసరంగా అతిథులు రాకుండా చూసుకోండి. ప్రత్యేకించి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఇంటికి వచ్చేవారి ద్వారా ఎక్కువ ముప్పు ఉండే అవకాశం ఉంది. కరోనా సోకినవారికి దగ్గరగా ఉండేవారు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ బాధితుడిని తాకే వ్యక్తులు చేతికి గ్లోవ్స్ ధరించాలి. వారి బ్లడ్, స్టూల్, లేదా చెమట, సెలైవా, తెమడ, వాంతి, మూత్రం వంటివి తొలగించేటప్పుడు చేతి గ్లోవ్స్ తప్పక వాడాలి. ఆ తర్వాత గ్లోవ్స్ దూరంగా పారేయాలి. చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి.
ఇతరులకు దూరంగా.. వేరుగా ఉండండి :
వైరస్ సోకిన వ్యక్తి ఇతరులకు దూరంగా వేరుగా ఉండాలి. అందరితో పాటు కాకుండా వేరే చోట తినాలి. తాకే గిన్నెలు, కప్పులు, గ్లాసులు లేదా వెండి వస్తువులను తాకేటప్పుడు గ్లోవ్స్ ధరించాలి. ఆ తర్వాత వెంటనే సబ్బుతో వేడి నీళ్లతో కడగాలి. గ్లోవ్స్ తొలగించిన తర్వాత చేతులను శుభ్రంగా కడిగేయాలి. తాకిన వస్తువులను కూడా శుభ్రంగా కడగాలి. వ్యాధి సోకిన వ్యక్తికి సంబంధించిన ఒకరి గిన్నెలు, కప్పులు, గ్లాసులు, సిల్వర్ వేర్, టవల్స్, బెడ్ లేదా ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో సెల్ ఫోన్ వంటివి తాకరాదు. బాధితులు తాకిన ఇంట్లోని ఉపరితలాలను ప్రతిరోజు శానిటైజ్ చేయాలి.