Parents Influence Children : పిల్లలతో తల్లిదండ్రులు ఇలా ఉంటే గొప్ప మార్పులు ఖాయం!
ఉరుకులు పరుగుల ఈ యాంత్రిక జీవితంలో పిల్లల కోసం తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు కొందరు తల్లిదండ్రులు.. దాంతో ఆప్యాయతలు, విలువలు ఆవిరయ్యాయి. రాత్రి వచ్చేటప్పటికి నిద్దురపోయిన పిల్లలు..

How Parents Influence Childrens Lifestyle
parents influence children : ఉరుకులు పరుగుల ఈ యాంత్రిక జీవితంలో పిల్లల కోసం తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు కొందరు తల్లిదండ్రులు.. దాంతో ఆప్యాయతలు, విలువలు ఆవిరయ్యాయి. రాత్రి వచ్చేటప్పటికి నిద్దురపోయిన పిల్లలు.. పొద్దున్న లేవకముందే పనులకు పోయే నాన్నలు.. స్కూల్ బస్సు ఎక్కకముందే టాటా చెప్పే అమ్మల కారణంగా వారు ఆప్యాయతానురాగల తోపాటు విలువలు నేర్వలేకపోతున్నారన్న విషయాన్నీ గ్రహించాలి.
ప్రాథమిక దశలోని పిల్లల అవసరాలు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, అలాగే వారిని మేధావులుగా, గొప్పవారిగా తీర్చిదిద్దేలా ప్రోత్సహించడం కూడా అంతే ముఖ్యం. బయటి ప్రపంచంలో ఎలా సురక్షితంగా ఉండాలనే దానిపై పిల్లలకు మార్గనిర్దేశం చేసే ఏకైక వ్యక్తులు తల్లిదండ్రులే.. కాబట్టి సమాజంలో కష్టసుఖాల్ని ఎలా ఎదుర్కోవాలో అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది.
ఎదిగే వయసులో పిల్లలతో స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకోవడం చాలా ముఖ్యం. తద్వారా పిల్లలు ఎక్కువ విషయాలు పంచుకోవడానికి ఇష్టపడతారు. అంతేకాదు పిల్లలు తమ రహస్యాలన్నీ సంకోచం లేకుండా పంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
చిన్నవయసు నుంచి పిల్లలతో ఎక్కువ సమయం గడిపిన కారణంగా వారు ఏ విషయాన్నీ దాచకుండా తల్లిదండ్రులకు చెప్పడానికి ఇష్టపడతారు. ఆటల తోపాటు రోజువారీ కార్యకలాపాల గురించి వారితో చర్చించినట్టయితే పిల్లల్లో పోటీవాతావరణాన్ని ప్రోత్సాహించవచ్చు. రోజు రాత్రివేళ పిల్లలు నిద్రపోయేముందు వారికి ఏది మంచి, ఏది చెడు అనే విషయాలు కథల రూపంలో చెబుతుండాలి. ఈ కథలు ఖచ్చితంగా వారిని ప్రభావితం చేస్తాయి.. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఈ రకమైన భావనతో ఉండటం వలన వారి జీవన విధానంలో గొప్ప మార్పులు చూడవచ్చు.