Fat : చేతుల్లోని కొవ్వు తగ్గించుకోవటం ఎలా?

స్కిప్పింగ్ మహిళలకు సులభమైన వ్యాయామం. ఎక్కడైనా దీనిని చేయవచ్చు. స్కిప్పింగ్ చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శరీరంలోని కొవ్వు దీని వల్ల సులభంగా కరిగిపోతుంది.

Fat : చేతుల్లోని కొవ్వు తగ్గించుకోవటం ఎలా?

Fat On The Hands

Updated On : May 4, 2022 / 2:59 PM IST

Fat : మహిళలు చాలా మందిలో చేతులు లావు గా ఉండటంతో స్లీవ్ లెస్ డ్రస్ వేసుకునేందుకు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఇంట్లోనే చిన్నపాటి వ్యాయామాలతో సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. జిమ్ లకు వెళ్ళి అధిక సమయం కసరత్తులకోసం సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు. చేతుల్లోని కొవ్వును కరిగించుకుని చేతులను స్లిమ్ గా మార్చుకునేందుకు రెండు సులభమైన మార్గాలను అనుసరిస్తే సరిపోతుంది. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

స్కిప్పింగ్ ; స్కిప్పింగ్ మహిళలకు సులభమైన వ్యాయామం. ఎక్కడైనా దీనిని చేయవచ్చు. స్కిప్పింగ్ చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శరీరంలోని కొవ్వు దీని వల్ల సులభంగా కరిగిపోతుంది. లావుగా కొవ్వుతో నిండిన చేతులు స్కిప్పింగ్ తో నాజుగ్గా మార్చుకోవచ్చు. క్రమం తప్పకుండా స్కిప్పింగ్ చేయటం వల్ల శరీరం బలంగా మారుతుంది. ఎముకల ధృఢంగా తయారవుతాయి. రోజు స్కిప్పింగ్ చేయటం వల్ల అధిక బరువు తగ్గటం తోపాటు ఆరోగ్యాంగా ఉండవచ్చు.

స్ట్రెచ్చింగ్ ; స్ట్రెచ్చింగ్ ఎక్సర్ సైజ్ వల్ల శరీరం ఫిట్ గా మారుతుంది. చేతులను స్ట్రెచ్ చేయటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రోజు మొత్తం శరీరం చురుకుగా ఉంటుంది. హార్మోన్ల పనితీరు మెరుగవుతుంది. దీన్ని ఎక్కడైనా చేయవచ్చు. ఉద్యోగులైతే తాము పనిచేసే కార్యాలయంలోనే కొద్ది సమయం చేతులను స్ట్రెచ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. స్ట్రెచ్చింగ్ వల్ల చేతుల్లో కొవ్వు కరిగి పోతుంది. చేతులు నాజుగ్గా మారతాయి.