పారాసెటమాల్ వేస్తే కరోనా వైరస్ తగ్గుతుందా? సైంటిస్ట్ లు ఏం చెబుతున్నారు?

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకి కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 125కు చేరింది. అన్ని ఎయిర్‌పోర్టుల్లో, రైళ్లలోనూ థర్మల్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రయాణికులను పరీక్షిస్తున్నారు.
కరోనా గురించి ఫ్రెంచ్ హల్త్ మినిస్టర్ Olivier Véran (మార్చి 14, 2020)న కరోనా వైరస్ పై ఓ ట్విట్ చేశాడు. ఆయన ఫేమస్ న్యూరాలజిస్ట్. ibuprofen, cortisoneఅలాంటి వాపునుతగ్గించే మందులను వాడితే infection మరింత పెరిగే అవకాశముంది. ఒకవేళ జ్వరమొస్తే paracetamol తీసుకోవచ్చు. ibuprofen వాడకం వద్దనే అంటున్నారు. COVID-19 positive అనుకోండి, కరోనా లక్షణాలు మరింత పెరగొచ్చు. దానికిబదులు జ్వరానికి paracetamol తీసుకొంటే బెటర్.
పెరుచెప్పడానికి ఇష్టపడని వైద్యనిపుణుడు ఇలాంటి సలహానే ఇచ్చారు
“ viral infectionsకు మేం పరాసెట్మాల్ ఇవ్వడానికే ఇష్టపడతాం. దానివల్ల రోగులకు సేఫ్.” Paracetamolని ఎందుకు డాక్టర్లు సిఫార్స్ చేస్తున్నారు? దీని మోతాదు తక్కువ. దానికి ఇంకో గుణముంది. చెడుప్రభావంలేకుండానే వాపును తగ్గిస్తుంది.
కరోనా సోకితే.. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఛాతిలో నొప్పి, వాంతులు తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు తీవ్రమై న్యూమోనియాకు దారితీసి ఊపిరాడక మనిషి మరణించే ప్రమాదమూ ఉంటుంది. అయితే ఈ లక్షణాలకు చికిత్స చేయడం తప్ప మరెలాంటి వ్యాక్సిన్ అందుబాటులోలేదు కాబట్టి మీరు పారసెట్మల్ ఉపయోగించవచ్చు, కానీ ఇబుప్రోఫెన్ టాబ్లెట్ మాత్రం అంత మంచిది కాదని తెలిపారు.
పారాసెటమాల్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. ఇది అన్ని వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతోంది. ఇబుప్రోఫెన్ లాంటి టాబ్లెట్లు అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ప్రమాదకరం. శరీర రోగనిరోధక వ్యవస్థ తగ్గిస్తాయి.
See Also | కాపర్ వాడితే కరోనా దూరం…నిమిషాల్లోనే వైరస్ చనిపోతుందట!