Thyroid : ఈ లక్షణాలు ఉంటే….థైరాయిడ్‌ కావచ్చు

పెద్దవాళ్ళకు వారి రోజువారీ పని సక్రమంగా చేసుకోవడానికి సరైన శక్తీ మరియు ఆసక్తి కలగడానికి మరియు లైంగిక వాంఛ కలగడానికికూడా థైరాయిడ్ సక్రమంగా పనిచేయటం చాలా అవసరం.

Thyroid : ఈ లక్షణాలు ఉంటే….థైరాయిడ్‌ కావచ్చు

Thyroid

Updated On : January 30, 2022 / 3:32 PM IST

Thyroid : మన దేహంలో గల ముఖ్యమైన అవయవాలు వాటి పనితనం సక్రమంగా ఉండటానికి థైరాయిడ్ హార్మోన్లు ముఖ్యమైనవి. థైరాయిడ్ హార్మోన్లు సరైన మొత్తంలో ఈ హార్మోన్లు ఉన్నపుడు పిల్లలో మెదడు చురుకుదనం పెంపొందుతుంది.గర్భధారణ సమయంలో నిర్ణీత స్థాయిలో గల థైరాయిడ్ హార్మోన్ల వల్ల తల్లి మరియు గర్భంలో ఎదుగుతున్న శిశువు ఆరోగ్యంగా ఉంటారు. పెరిగే వయసులో గల పిల్లలకు వాళ్ళ వారి శారీరక ఎదుగుదలకు థైరాయిడ్ హార్మోన్లు చాలా దోహదపడతాయి. పెద్దవాళ్ళకు వారి రోజువారీ పని సక్రమంగా చేసుకోవడానికి సరైన శక్తీ మరియు ఆసక్తి కలగడానికి మరియు లైంగిక వాంఛ కలగడానికికూడా థైరాయిడ్ సక్రమంగా పనిచేయటం చాలా అవసరం. స్త్రీలలో థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే నెలసరులు సరిగ్గా సమయానికి రాకుండా క్రమం తప్పే అవకాశం ఉంది. తలనొప్పి, కడుపులో ఇబ్బందిగా అనిపించడం, నీరసం… ఇలాంటి లక్షణాలు రోజూ ఉంటే… పని జత్తిడి మూలంగా ఇవన్నీ వస్తున్నాయని తేలిగ్గా తీసిపారేయకండి. ఈ లక్షణాలు థైరాయిడ్‌ సమస్యకు సంకేతాలు కావచ్చు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

నీరసం ; థైరాయిడ్‌ సమస్య ఉన్న వారిలో కనిపించే ప్రధాన లక్షణం నీరసం.

జీర్ణసమస్యలు : డయేరియా లేక మలబద్ధకం థైరాయిడ్‌లో కనిపించే మరో లక్షణం. కడుపు ఉబ్బరం కూడా ఉంటుంది.

బరువులో తేడా : థైరాయిడ్‌ గ్రంధి జీవక్రియలను నియంత్రిస్తుంది. బరువు తగ్గుతున్నట్లయితే హైపర్‌థైరాయిడిజం, బరువు పెరుగుతున్నట్లయితే హైపోథైరాయిడిజంగా భావించాలి. మెట బాలిజం లెవెల్స్‌ పెరగడం, తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది.

శ్వాసకోశ సమస్యలు : సోయా, నట్స్‌, క్యాబేజి వంటి ఆహారపదార్జాలు థైరాయిడ్‌ పనితీరును తగ్గిస్తాయి. ఈసారి మీరు ఇవి తిన్నప్పుడు శ్వాస సమస్యలు తలెత్తినట్లయితే ఒకసారి చెక్‌ చేయించుకోండి.

డిగ్రైషన్‌ : శరీర పనితీరుపైనే కాకుండా మానసిక పనితీరుపై కూడా హార్మోన్ల ప్రభావం ఉంటుంది. ఎటువంటి కారణం లేకుండా మూడ్‌ బాగా లేదని అంటున్నారంటే థైరాయిడ్‌ గురించి ఆలోచించాల్సిందే.

గాయిటర్‌ : థైరాయిడ్‌ గ్రంధి పెరగటాన్ని గాయిటర్‌ అంటారు. ఎటువంటి చికిత్స తీసుకోని వారిలో థైరాయిడ్‌ గ్రంధి బాగా పెరిగి గొంతు దగ్గర స్పష్టంగా వాపు కనిపిస్తుంది.

హార్డ్‌రేట్‌ : ఉద్వేగభరితమైన సంఘటనలు ఏమీ లేకపోయినా హార్ష్‌బీట్‌ పెరిగిపోతుంటే కనుక థైరాయిడ్‌ సమస్య ఉందేమో చెక్‌ చేసుకోవాలి.

అకలి లేకపోవడం : థైరాయిడ్‌ సమస్య ప్రారంభదశలో కనిపించే లక్షణం ఆకలి లేకపోవడం. బరువు తగ్గుతున్నా, పెరుగుతున్నా ఏమీ తినాలనిపించదు. ఆకలి లేకుండా పోతుంది. ఈలక్షణాలు ఉన్నట్లయితే థైరాయిడ్‌ చెకప్‌ చేసుకుని సందేహాలను నివృత్తి చేసుకోవడం ఉత్తమం.