Orange : గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే….నారింజ
నారింజ క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మూత్రంలో అదనపు సిట్రేట్ బయటకు పంపి ఆమ్లతను తగ్గిస్తుంది. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్ల వంటి సమస్యలు రాకుండా నివారించబడతాయని అధ్యయనాల్లో తేలింది.

Orange
Orange : నారింజ పండు చూడగానే చాలా మందికి నోరూరిపోతుంది. నారింజలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో నిండి ఉంటుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో మంచి ప్రాధాన్యత కలిగిన పండుగా చెప్పవచ్చు. నారింజను ఆహారంగా తీసుకోవటమే కాకుండా సౌందర్య సాధనాల్లో కూడా ఒక పదార్ధంగా మారింది. నారింజలో ఫైబర్, విటమిన్ సి, థియామిన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, రిబోఫ్లేవిన్, నియాసిన్, పాంతోతేనిక్ ఆమ్లం, విటమిన్ బి, ఐరన్, మాంగనీస్, జింక్ ఉంటాయి. ఈ పండును రోజు వారి ఆహారంగా చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
నారింజలో ఉండే కరిగే, కరగని ఫైబర్ ప్రేగులకు మేలు చేస్తుంది. జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నారింజలో ఉండే మెగ్నీషియం రక్తపోటు నియంత్రించటంలో సహాయపడుతుంది. నారింజలో ఉండే హెస్పెరిడిన్ అనే ఫ్లెవనాయిడ్ లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఈ పండులో ఉండే విటమిన్ సి శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా, రోగనిరోధక శక్తిని పెంచే ఏజెంట్ గా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని నాశనం చేస్తుంది. క్యాన్సర్ దరిచేరకుండా చేస్తుంది.
నారింజలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్ తో పోరాడతాయి. కొలెస్ట్రాల్ యొక్క ఆక్సీకరణను నివారించటంలో సహాయపడతాయి. గుండెకు రక్త సరఫరా సాఫీగా సాగేలా చేస్తాయి. గుండెవ్యాధుల నుండి రక్షిస్తాయి. శరీరం అంటు వ్యాధులను ఎదుర్కొనేలా మంచి ఆరోగ్యాన్ని నారింజ అందిస్తుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ యాంటీ వైరల్ ,అంటు వ్యాధులను శరీరంలోకి ప్రవేశించే వైరస్ లను చంపేస్తాయి.
శరీరంలోని వ్యర్ధాలను తొలగించటంలో నారింజ అద్భుతంగా ఉపకరిస్తుంది. ఈపండులో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరంలో ఎంజైమ్ కార్యకలాపాలను ప్రారంభించటానికి, కాలేయంలో విషాలను బయటకు పంపటానికి సహాయపడతాయి. రక్తాన్ని శుద్ధి చేయటానికి ఉపకరిస్తాయి. నారింజలో ఉండే కాల్షియం ఎముకులను బలానికి తోడ్పడుతుంది. చిగుళ్లు, నోటి ఆరోగ్యాన్ని నారింజ మెరుగుపరుస్తుంది. నారింజలోని విటమిన్ సి చెడు శ్వాసకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడం ద్వారా శ్వాసను ఎక్కవ సేపు తాజాగా ఉంచుతుంది.
నారింజ క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మూత్రంలో అదనపు సిట్రేట్ బయటకు పంపి ఆమ్లతను తగ్గిస్తుంది. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్ల వంటి సమస్యలు రాకుండా నివారించబడతాయని అధ్యయనాల్లో తేలింది. చక్కెర స్ధాయిలను నియంత్రించి కిడ్నీపై ఒత్తిడి తగ్గించటం ద్వారా పనితీరు మెరుగుపడేలా చేయటంలో నారింజ సహాయపడుతుంది. నారింజను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ఉబ్బసం వ్యాధి కారణంగా వచ్చే వాయు మార్గాల వాపును తగ్గించటంలో సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అయితే నారింజ పండ్లను మితంగానే తీసుకోవాలి. అధిక మొత్తంలో తీసుకుంటే కొన్ని దుష్పలితాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్తపోటు సమస్యకు మందులు వాడుతుంటే అలాంటి వారు నారింజపండు తీసుకోకుండా ఉండటం మంచిది. నారింజ ఎక్కువగా తింటే మలబద్ధకం, విరేచనాలు, కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి.