Green Tea : శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపటంతో పాటుగా, కొవ్వు కరిగించే గ్రీన్ టీ!
అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ లో కాటెకిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధిక బరువును తగ్గిస్తాయి.

In addition to flushing out the waste in the body, green tea that burns fat!
Green Tea : ఆధునిక జీవన శైలి లో గ్రీన్ టీ శరీరానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొవ్వు కరిగించుకునేందుకు వ్యాయమం చేయడం మాత్రమే కాదు. శరీరానికి తగిన ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. శరీరంలోని కొవ్వు వల్ల అనేక ఆనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడవం వల్ల గుండెకు రక్తం చేరుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గ్రీన్ టీ ఉపకరిస్తుంది.
గ్రీన్ టీ వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు తగ్గొచ్చు. గ్రీన్ టీని నిత్యం తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గ్రీన్ టీలో మన శరీరానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. దగ్గు, ఫ్లూ జ్వరం తదితర వ్యాధుల నుంచి రక్షణగా నిలుస్తుంది. గ్రీన్ టీలో క్యాలరీలు ఉండవు. అంతేకాకుండా గ్రీన్ టీ తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఇతర ఆహారాలపై ఆసక్తి తగ్గిపోతుంది.
అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ లో కాటెకిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధిక బరువును తగ్గిస్తాయి. రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ సేవిస్తే పొట్ట చుట్టూ ఉండే కొవ్వులు కరిగిపోతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
గ్రీన్ టీ తాగడం వల్ల శరీర మెటబాలిజం రేటు 4 శాతం వరకు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి . గ్రీన్ టీ రక్తపోటుకి కారణమయ్యే ఎంజైమ్ విడుదలను అదుపులో ఉంచటం సహాయపడుతుంది. రక్తపోటు తగ్గుదలకు తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిలో, డయాబెటిస్ రోగులకు గ్రీన్ టీ వారి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ టీని తీసుకునే సందర్భంలో దానిలో చక్కెరకు బదులుగా తేనె కలుపుకుంటే అద్భుతమైన లాభాలుంటాయి. అయితే గ్రీన్ ఎంత ఆరోగ్యకరమే అయినా మోతాదుకు మించి సేవించరాదు. గ్రీన్ టీ అధికంగా తాగితే డీహైడ్రేషన్, అసిడిటీ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. గ్రీన్ టీని మోతాదులో తాగితే కొవ్వులు కరిగి అధిక బరువు సమస్య నుంచి బయట పడవచ్చు.