Horse Gram : గుండె ఆరోగ్యంతోపాటు, బరువు తగ్గించే ఉలవలు
ఉలవలు కొలెస్ట్రాల్ తగ్గించే సామర్థ్యం కలిగిఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఉత్పత్తి పెరగడం, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడం ద్వారా శరీరం నియంత్రణలో ఉంటుంది.

Ulavalu (1)
Horse Gram : ఉలవల పప్పు ముదురు గోధుమ రంగులో ఉంటుంది. దీనిని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పండించే ఉలవలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. రసం ,సాంబార్ వంటి వంటకాలలో వీటిని వినియోగిస్తారు. ఉలవలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఉలవల్లో ఐరన్ య కాల్షియం, ఫాస్పరస్ , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి మంచి పోషకాలను అందిస్తాయి. ఇందులో ఉండే అధిక స్ధాయి ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలను నియంత్రించటంలో సహాయపడతాయి. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఉలవలు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండా ఉలవలను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
ఉలవలు కొలెస్ట్రాల్ తగ్గించే సామర్థ్యం కలిగిఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఉత్పత్తి పెరగడం, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడం ద్వారా శరీరం నియంత్రణలో ఉంటుంది. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఈ పప్పు ఫైబర్ కు మంచి మూలం. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణవ్యవస్థ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. స్థూలకాయంతో బాధపడేవారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఉలవలు చాలా ఉపయోగకరం. ఊబకాయం తగ్గించడానికి , ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
బరువు తగ్గాలనుకునే వారు ఉలవలను తీసుకోవటం ఉత్మమైన మార్గం. రోజు వారి పనుల్లో నెలకొనే అలసటను ఇది తగ్గిస్తుంది. మహిళ రుతుసమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. దృష్టిలోపం మెరుగుపడుతుంది. ఎదుగుతున్న పిల్లలకు ఇందులో ఉండే ప్రొటీన్ ఎంతగానో ఉపకరిస్తుంది. ఉల్లవల్లో ఆకలి పెంచే గుణాలు ఉన్నాయి. మూత్రాశయంలో రాళ్లు కరిగేందుకు దోహదపడతాయి. ఉలవచారు రోజు తీసుకుంటే శరీరంలోని కొవ్వులు కరిగిపోతాయి. లైంగిక శక్తి పెంచటంలో ఉలవల్ని మించినవి లేవనే చెప్పాలి. కాలేయ వ్యాధులతో బాధపడేవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.