Fatigue : అలసట తగ్గించుకునేందుకు ఆహారంలో….

నిద్రకు ముందుగా గ్లాసుడు పాలు, ఒక ఆరటివండు తిని పండుకుంటే జీర్ణక్రియకు, సంబంధించిన వ్యాధులు దరిచేరవు.

Fatigue : అలసట తగ్గించుకునేందుకు ఆహారంలో….

Relaxing

Updated On : February 3, 2022 / 9:45 AM IST

Fatigue : ఎంతో బిజీగా ఉంటూ, ఎన్నోపనులు చేసుకుంటూ కొందరు చాలా చురుకుగా కనిపిస్తారు. మరి కొందరు ఎక్కువ పని చేయకపోయినా త్వరగా అలసిపోతారు. వాస్తవానికి అలసటకు అనేక కారణాలు ఉన్నాయి. వంశపారంపర్య హార్మోన్ల అసమతుల్యత, శరీరక కండరాల్లో ఉండే కొవ్వు తీవ్రత వంటివి కూడా అలసటకు కారణాలుగా చెప్పవచ్చు. మరి ఇలాంటి కారణాలు గల వారు ఆహారనియమాలు పాటించడం ద్వారా అలసటను తగ్గించుకోవచ్చు.

జీర్ణక్రియ నరిగ్గా లేకపోవడం అలసటకు కారణమౌతుంది. ఆహారం బాగా జీర్ణమయి ఒంటికి పడితే మంచి శక్తి వస్తుంది. కాబట్టి జీర్ణక్రియను మెరుగువరుచుకునేందుకు కావలసినంత నీటిని తాగటం ఎంతో ఉత్తమం. ప్రతిరోజూ ఒకపూట ఆకుకూరలను వాడటం ఎంతో మంచిది. ఆకుకూరలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు, కొత్తిమీర, అల్లం, జీలకర్రను వంటల్లో అధికంగా వాడాలి.

నిద్రకు ముందుగా గ్లాసుడు పాలు, ఒక ఆరటివండు తిని పండుకుంటే జీర్ణక్రియకు, సంబంధించిన వ్యాధులు దరిచేరవు. సమయానికి తినడం చేస్తే జీర్ణప్రక్రియ సులభమై శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. కొవ్వుతో కూడిన ఆహారపదార్థాలను తినడం, మానేస్తే మంచిది.

జంక్‌ఫుడ్‌ను అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ఈ జంక్‌ పుడ్స్‌ తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్‌ ఎక్కువగా శరీరంలో చేరుతుంది. తద్వారా బరువు పెరుగుతారు. అందుకే జంక్‌వుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలసటకు దూరంగాఉండాలంటే ఆహారంలో సమయపాలన, పండ్లరసాలు, ఆకుకూరలను తగిన మోతాదులో,తీసుకోవడం ఉత్తమమైన మార్గం.