Fennel seeds : భోజనం పూర్తయ్యాక సోంపు గింజలు తింటే మంచిదా!..
వంటకాల తయారీతోపాటు, కిళ్ళీల్లో , మందుల తయారీలో వీటిని విరివిగా వినియోగిస్తుంటారు. సోపు గింజలను తినటం వల్ల లాలాజలంలో నైట్రేట్ శాతం పెరుగటంతోపాటు రక్తపో

Soamp Seeds
Fennel seeds : భారతీయుల ఆహారపు అలవాట్లలో సోంపు గింజలు తీసుకోవటం ఒక భాగం. ఎన్నో తరాల నుండి ఈ అలవాటు వస్తుంది. మనం హోటల్స్ కు ఆహారం తినేందుకు వెళితే, తినటం పూర్తయ్యాక మనకు సోంపు గింజలతో బిల్ ను తీసుకువచ్చి ఇస్తుంటారు. ఇవన్నీ మనం నిత్యం చూసేవే.. అయితే సోంపు గింజలను ఆహారం తీసుకున్న తరువాత ఎందుకు తినాలి.. తింటే ఏంజరుగుతుందన్న విషయంపై మాత్రం చాలా మందిలో అవగాహన ఉండదు. అయితే ఈ విషయాన్ని అంతా తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
సోంపు గింజల్లో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు , మంచి పోషకాలను ఇవి కలిగి ఉన్నాయి. నోట్లో వేసుకుంటే కమ్మని సువాసన వెదజల్లే సోంపు గింజలు ప్రస్తుతం మౌత్ ప్రెషనర్లు, వక్కపొడులు, ఐస్ క్రీములు, పేస్టుల తయారీలోను వినియోగిస్తున్నారు. ఈ గింజల్లో రాగి, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఐరన్, సెలెలియం, మాంగనీస్ , కాల్షియం వంటి అనేక ఖనిజాలు అధికమొత్తంలో ఉంటాయి.
వంటకాల తయారీతోపాటు, కిళ్ళీల్లో , మందుల తయారీలో వీటిని విరివిగా వినియోగిస్తుంటారు. సోపు గింజలను తినటం వల్ల లాలాజలంలో నైట్రేట్ శాతం పెరుగటంతోపాటు రక్తపోటు సమతుల్యంగా ఉంచటంలో బాగా పనిచేస్తాయి. పొటాషియం అధికంగా ఉండటం వల్ల శరీరంలో తగినంత నీరు ఉండేలా చూస్తుంది. శరీరంలో వ్యర్ధ ద్రవాలను యూరిన్ ద్వారా బయటకు పంపటంలో సహాయకారిగా పనిచేస్తుంది. మూత్ర ఇన్ ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.
రక్త హీనత లేకుండా చేయటం తోపాటు, బరువు తగ్గటానికి బాగా ఉపకరిస్తుంది. శరీరంలో ఉండే చెడు కొవ్వులు కరిగిపోవటంలో సోంపు మంచి పనితీరు కనబరుస్తుంది. సోంపు తో టీ తయారు చేసుకుని తాగితే కొవ్వు కరిగిపోయేందుకు వీలుంటుంది. మహిళల్లో రుతుక్రమాన్ని మెరుగుపర్చటంతోపాటు, క్యాన్సర్ వంటి వ్యాదులను నిరోధిస్తుంది. ఇందులో ఉండే ఫలావోనోయిడ్స్, ఫినాల్స్ అనే పదార్ధులు కణితులు, ఏర్పడకుండా , పెరగకుండా చేయటంలో దోహదం చేస్తాయి.
ఊపిరితిత్తులతోపాటు, కంటి ఆరోగ్యాన్ని సోంపు గింజలు మెరుగు పరుస్తాయి. శరీరంలోని కణజాలానికి మరమ్మత్తులు చేయటంతోపాటు, రోగ నిరోధకశక్తి పెంపొందిస్తుంది. సోంపు గింజల్లో ఉండే మాంగనీస్ శరీర మెటబాలిజం పెంపొందిస్తుంది. ఎముకలను వృద్ధికి , డయాబెటిస్ కంట్రోల్ కు ఉపకరిస్తుంది.