Brinjal : డయాబెటిస్ తో బాధపడేవారు వంకాయ తినటం మంచిదా?
గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు ఉంటాయి కనుక వంకాయలను తినడం వల్ల ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

Brinjal
Brinjal : డయాబెటిస్ సైలెంట్ కిల్లర్. దీనిని నియంత్రణలో ఉంచకపోతే అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా చిన్న వయసులోనే షుగర్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ వస్తే జీవిత కాలం మందులు వాడాల్సిందే. డయాబెటిస్ సమస్య ఉన్నవారు తీసుకునే ఆహారాలు విషయంలో అనేక లిమిటేషన్స్ ఉంటాయి.మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలు తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది. డయబెటిస్ ఉన్నవారిలో ఆహారం కీలక పాత్రను పోషిస్తుంది.
.
డయాబెటిస్ ఉన్నవారికి వంకాయ చాలా మంచిది. వంకాయ లో విటమిన్ బి కాంప్లెక్స్, సి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఫైటో న్యూట్రియంట్స్, యాందో సైనిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. డయాబెటిస్ ఉన్నవారు దీనిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదట. వంకాయలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర నిదానంగా కలుస్తుంది. దాంతో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
వంకాయలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండటం వలన డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకే వంకాయలను తిన్న వెంటనే రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు. వంకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కారణంగా వచ్చే నష్టంను నివారిస్తుంది.
గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు ఉంటాయి కనుక వంకాయలను తినడం వల్ల ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి డయబెటిస్ ఉన్నవారు వారంలో 2 సార్లు వంకాయ తింటే మంచిది. టైప్ డయాబెటిస్ -2 ను తగ్గించడంలో వంకాయ కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారు వారంలో రెండు లేదా మూడు సార్లు కచ్చితంగా తినాలి. మందుల కంటే సహజసిద్ధంగా డయాబెటిస్ ను తగ్గించుకోవాలి.
అయితే షుగర్ తో బాధపడుతూ ఇతరత్రా సమస్యలతో ఉన్నవారు వంకాయను తినకపోవటమే మంచిది. జ్వరంతో బాధపడుతున్న వారు వంకాయలను తినకూడదు.. సాధారణంగా వంకాయ తినటం వలన శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందువలన ఫీవర్ వచ్చినప్పుడు వంకాయలను తీసుకోకూడదు. తామర, గజ్జి, ఎలర్జీ, చర్మ సమస్యలు ఉన్నవారు వంకాయలు తీసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే వంకాయలలో అలర్జీ వచ్చే గుణాలు అధికంగా ఉంటాయి. అందువలన ఇప్పటికే స్కిన్ ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్నవారు వీటిని తీసుకోకండి.
వంకాయ తినడం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అలా అని ఎక్కువగా తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వంకాయలు తింటే బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. అందువలన రక్త పోటు సమస్య తో బాధపడుతున్న వారు వంకాయ లకు దూరంగా ఉండాలి.