Ammonia : అమోనియా స్ధాయిలు అధికంగా ఉండే ఈ ఆహారాలను మితంగా తీసుకోవటం బెటర్ !

చీజ్‌ను తినటమంటే చాలా మందికి ఇష్టం. పిజ్జా, బర్గర్‌లో ఎక్స్‌ట్రా చీజ్‌ వేయించుకుని తింటారు. ఈచీజ్‌లో అమోనియా ఎక్కువగా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం, చీజ్‌లో అమోనియా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల చీజ్‌లో 0.138 గ్రాముల అమోనియా ఉంటుంది.

Ammonia : అమోనియా స్ధాయిలు అధికంగా ఉండే ఈ ఆహారాలను మితంగా తీసుకోవటం బెటర్ !

It is better to consume these foods that are high in ammonia levels!

Updated On : February 15, 2023 / 12:25 PM IST

Ammonia : అత్యంత విస్తృతంగా తయారు చేయబడిన రసాయనాలలో ఒకటిగా ఉండటంతోపాటుగా, సహజంగా మన శరీరంలో సైతం ఉత్పత్తి చేయబడుతుంది అమ్మోనియా. దాని స్వచ్ఛమైన రూపంలో అన్‌హైడ్రస్ అమ్మోనియా అని పిలుస్తారు, ఇది మన చుట్టూ ఉన్న సహజ వాతావరణంలో కూడా సేంద్రీయంగా సంభవిస్తుంది, ఇది నేలలోని జంతు మరియు మొక్కల పదార్థాల బ్యాక్టీరియా కుళ్ళిపోయే ప్రక్రియల ద్వారా ఏర్పడుతుంది.

దాని సేంద్రీయ వినియోగం పక్కన పెడితే, గృహ శుభ్రపరిచే ఉత్పత్తులు, పారిశ్రామిక ప్రాసెసింగ్ సాధనాలు మరియు సౌందర్య ఉత్పత్తులను రూపొందించడంలో అమ్మోనియా విస్తృతంగా ఉపయోగిస్తారు. మీకు తెలియని విషయం ఏమిటంటే, మీరు ప్రతిరోజూ తినే అనేక ఆహారాలు అధిక స్థాయిలో అమ్మోనియాను కలిగి ఉంటాయి. మనం రోజూ తీసుకునే ఆహారం, డ్రింక్స్‌లో ఎన్నో టాక్సిన్స్‌, వ్యర్థ పదార్థాలు ఉండి అవన్నీ శరీరంలోని అవయవాలల్లో పేరుకుపోతాయి. కొన్ని వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్‌ చెమట, యూరిన్‌ రూపం బయటకు వచ్చేస్తాయి. కొన్ని మాత్రం వివిధ అవయవాలలో ఉండిపోయి నిధానంగా వాటిని దెబ్బతీస్తాయి.

కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, యూరిక్ యాసిడ్, యూరియా వంటి టాక్సిన్స్‌ శరీరంలో పేరుకుపోయి ఆరోగ్యానికి హాని చేస్తాయి. అలాంటి విషపూరితమైన రసాయనాలలో అమోనియా ఒకటి. శరీరలంలో అమోనియా స్థాయిలు ఎక్కువైతే గందరగోళం, మానసిక కల్లోలం, మూర్ఛ, వాంతులు, చికాకు వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. దీని స్థాయిలు అధికమైతే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అమోనియా లివర్‌, కిడ్నీలు, మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. అమోనియా స్థాయిలు పెరిగితే చివరికి ప్రాణానికే ప్రమాదం వాటిల్లుతుంది. కొన్ని ఆహార పదార్థాలు అతిగా తింటే రక్తంలో అమోనియా స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఉల్లిపాయలు ; ఉల్లిపాయ లేకుండా కూరలు వండరు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయ మన ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు, దంతాలు దృఢమవుతాయి. శ్వాస ఇబ్బందులు తొలగుతాయి. తలనొప్పి, హైపర్‌టెన్షన్‌, నోటిపూత.. వంటి అనేక అనారోగ్యాలకు ఉల్లిపాయ చెక్‌ పెడుతుంది. ఉల్లిపాయలో అమెనియా కంటెంట్‌ ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. 100 గ్రాముల ఉల్లిపాయలో 0.027 గ్రాముల అమోనియా ఉంటుంది. అయితే ఉల్లిపాయను అధిక మోతాదులో మాత్రం తీసుకోకపోవటమే మంచిదని సూచిస్తున్నారు.

చీజ్ ; చీజ్‌ను తినటమంటే చాలా మందికి ఇష్టం. పిజ్జా, బర్గర్‌లో ఎక్స్‌ట్రా చీజ్‌ వేయించుకుని తింటారు. ఈచీజ్‌లో అమోనియా ఎక్కువగా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం, చీజ్‌లో అమోనియా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల చీజ్‌లో 0.138 గ్రాముల అమోనియా ఉంటుంది. మన శరీరంలో అమోనియా స్థాయిలను కంట్రోల్‌లో ఉండాలంటే చీజ్‌ తినడం తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, లివర్‌ సమస్యతో బాధపడేవారు చీజ్‌కు దూరంగా ఉండటమే మంచిది.