Cholesterol : రోజుకు ఒక్క గ్లాస్ తాగితే చాలు కొవ్వు కరిగిపోతుంది!
బెల్లం, నిమ్మరసం, మిరియాల పొడి ఇవి మూడు రోజు వారిగా మనం వినియోగించేవే. అందులోను వీటిలో అనేక ఔషదగుణాలు ఉన్నట్లు ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. వీటిని పరిమిత మోతాదులో తీసుకోవటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు వచ్చే అవకాశం ఉండదు. మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.

Cholesterol
Cholesterol : అధిక బరువు సమస్యతో సతమతం అయ్యేవారు బరువు తగ్గేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరు ఏంచేసినా ఆరోగ్య కరంగా బరువు తగ్గటం అన్నది చాలా ముఖ్యం. ఆరోగ్య కరంగా బరువు తగ్గాలనుకునే వారికి బెల్లం, నిమ్మరసం, మిరియాల పొడితో తయారు చేసిన జ్యూస్ ఎంతగానో ఉపకరిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం, నిమ్మరసం, మిరియాల పొడి ఇవి మూడు రోజు వారిగా మనం వినియోగించేవే. అందులోను వీటిలో అనేక ఔషదగుణాలు ఉన్నట్లు ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. వీటిని పరిమిత మోతాదులో తీసుకోవటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు వచ్చే అవకాశం ఉండదు. మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
జూస్ తయారు చేసుకునే విధానం ; ముందుగా ఒక గ్లాసులో వేడి నీటిని తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ బెల్లపు పొడిని వేసుకుని కలియబెట్టాలి. బెల్లం పొడి కరిగిపోయాక , ఒక రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక చిటికెడు మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తరువాత దానిని తాగాలి. ఈ జ్యూస్ ను ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో సేవించాలి. ఈ విధంగా తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతారు.
ఇలా చేయటం వల్ల శరీరంలోని కొవ్వు వేగంగా కరుగుతుంది. మెటబాలిజం రేటు పెరుగుతుంది. బరువు క్రమేపి తగ్గుతారు. బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వారు దీనిని రోజువారిగా తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి బాగా పుంజుకుంటుంది. రక్తహీనత సమస్య తొలగిపోతుంది. లివర్ శుభ్రపడుతుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సీజనల్ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అజీర్ణం, పైత్యం తగ్గుతాయి. నీరసం వంటివి పోయి శరీరం యాక్టివ్ గా మారుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగటం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు సైతం దరిచేరవు.