Lemon Juice : అన్నికాలాల్లో ఆరోగ్యానికి మేలు చేసే నిమ్మరసం!
నోటి దుర్వాసన సమ్యతో బాధపడుతున్న వారు ఉదయం సమయంలో నిమ్మరసం తాగితే మంచిది. నిమ్మలోని గుణాలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి.

Lime Water
Lemon Juice : వేసవి కాలమే కాదు అన్ని కాలాల్లో నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించే నిమ్మరసంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మ రసాన్ని ఉదయం సమయంలో తీసుకోవటం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్ధాలు బయటకు పంపటంతోపాటు కడుపులో మంట సమస్యను అదుపు చేస్తుంది. కాలేయానికి మేలు చేసే ఎంజైముల ఉత్పత్తికి తోడ్పడుతుంది. శరీరంలో తక్షణ శక్తి కావాలంటే నిమ్మరసంతో తయారు చేసిన వాటర్ ను తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
నోటి దుర్వాసన సమ్యతో బాధపడుతున్న వారు ఉదయం సమయంలో నిమ్మరసం తాగితే మంచిది. నిమ్మలోని గుణాలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. అంతేకాకుండా నోటిని తాజాగా ఉంచేందుకు దోహదపడుతుంది. రోజువారిగా ఉదయం బ్రష్ చేసే సమయంలో పేస్ట్ పై రెండు మూడు నిమ్మ చుక్కులు వేసుకుని దంతాలను శుభ్రపరుచుకుంటే దంత సమస్యలు దరిచేరవు. వర్షకాలంలో, చలికాలంలో వచ్చే చర్మ సంబంధిత సమస్యలను నివారించటంలో నిమ్మ ఎంతగానో ఉపకరిస్తుంది. చలికాలంలో, వర్షాకాలంలో రోజువారిగా నిమ్మరసం తీసుకోవటం వల్ల చర్మ సమస్యలు దరిచేరవు. రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్ధాలన్నీ తొలగిపోయి చర్మం నిగారింపు సంతరించుకునేలా నిమ్మరసం తోడ్పడుతుంది.
జలుబు, దగ్గు, వైరల్ ఇన్ ఫెక్షన్లు దరి చేరకుండా చూస్తుంది. నిమ్మకాయలోని విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇతర పండ్లతో పోలిస్తే నిమ్మకాయల్లో ఈ పోషకాలు అధికంగా ఉంటాయి. అలెర్జీ, ఉబ్బసం సమస్యలతో బాధపడుతున్నవారికి మంచి ఔషదంగా చెప్పవచ్చు. అయితే నిమ్మరసాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే పంటి ఎనామిల్ కు నష్టం కలుగుతుంది.