Dark Lips : పెదవులు నల్లగా మారుతున్నాయా! కారణం తెలుసా?
కొన్ని రకాల లిప్‌స్టిక్‌లు, గ్లోస్, బామ్‌లు వంటి పెదవుల సౌందర్య సాధనాలను ఉపయోగించడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది.

Dark Lips (1)
Dark Lips : ముఖంపై ఆనందాన్ని వ్యక్త పరచటంలో పెదవులదే కీలక పాత్ర. ముఖ్యంగా మహిళలు పెదవుల అందానికి పత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. పెదవులు అందంగా కనిపించేందుకు వివిధ రకాల లిప్టిక్స్ ను ఉపయోగిస్తుంటారు. పెదవులకు వివిధ రకాల కాస్మోటిక్స్ ను ఉపయోగించటం వల్ల వాటి ప్రభావం పెదవుల ఆరోగ్యం పై పడుతుంది. సహాజంగా ఉండాల్సిన పెదవులు కాస్త అందాన్ని కోల్పోయి నల్లగా మారిపోతుంటాయి. అదే క్రమంలో వాతావరణ పరిస్ధితులు ప్రభావం వల్ల సైతం పెదవులు రూపాన్ని కోల్పోతాయి.
సాధారణంగా కళ్ల కింద నల్లటి మచ్చలు ఉన్నట్లే, పెదవులపై చర్మం సైతం నల్లగా మారుతుంది. పెదవులు పొడిబారిపోయి పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. డార్క్ లిప్స్ అనేది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. దీని వల్ల సహజమైన గులాబీ రంగును పెదవులు కోల్పోతాయి. జీవనశైలి, అలవాట్లు ,వైద్యపరమైన అంశాలను బట్టి కూడా పెదవుల రంగు మారుతుంది. ముఖ్యంగా ధూమపానం వల్ల పెదవులు నల్లగా మారే అవకాశాలు అధికంగా ఉంటాయి. ధూమపానం అనేది ఊపిరితిత్తులకు మాత్రమే హాని కలిగించదు. దాని ప్రభావం పెదవులపై కూడా ఉంటుంది. ధూమపానం వల్ల పెదవులు నల్లగా కళావిహీనంగా తయారవుతాయి. సిగరెట్స్ లో ఉన్ననికోటిన్ పెదాలను నల్లగా మార్చుతుంది
కొన్ని రకాల లిప్‌స్టిక్‌లు, గ్లోస్, బామ్‌లు వంటి పెదవుల సౌందర్య సాధనాలను ఉపయోగించడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. లిప్‌స్టిక్‌లు అలెర్జీ కలిగించే కొన్ని రసాయనాలను కలిగి ఉండంతో వాటిలో ఉండే రసాయనాలు పెదవులపై హైపర్‌పిగ్మెంటేషన్‌కు కారణం కావచ్చు. దీని వల్ల పెదవులు నల్లగా మారిపోతాయి. రోజు వారిగా ఉపయోగించే కొన్ని రకాల టూత్ పెస్టులు సైతం పెదవులకు అలర్జీని కలిగిస్తాయి. ఇటీవలి కాలంలో మార్కెట్లోకి అనేక రకాల టూత్ పేస్ట్ లు వచ్చాయి. వాటిలో ఉపయోగించే రసాయనాల ప్రభావం పెదవులపై పడటం వల్ల పెదవులు సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాఫీ, టీలు త్రాగడం వల్ల పెదాలు నల్లగా మారుతాయి.
డార్క్ గా మారిన పెదవులను తిరిగి గులాబీ రంగులోకి మార్చేందుకు అనేక రకాల మార్గాలు ఉన్నాయి. వేసవి కాలంలో పెదవులపై యూవీ కిరణాలు పడకుండా లిప్ బామ్స్ అప్లై చేసుకోవటం మంచిది. వీటితో పాటుగా సహజ పదార్ధాలతో స్ర్కబింగ్ వల్ల పెదవులపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోతుంది. అలాగే పెదవులను ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. పెదవుల ఆరోగ్యం కోసం నాలుకతో తరచూ తడపటంతోపాటు, సరిపడినన్ని నీటిని శరీరానికి అందించాలి. విటమిన్ సి లోపిస్తే పెదాల నల్లబడతాయి. తీసుకొనే ఆహారంలో సమతుల ఆహారం ఉండేలా చూసుకోవాలి. కొన్ని రకాల కాస్మోటిక్స్ ను వాడే ముందు చర్మంపై పరీక్షించిన తరువాతనే వాడటం మంచిది.