Hibiscus Tea : రక్తంలో చక్కెర స్ధాయిలు తగ్గించే… మందారం టీ
మందార టీ తాగడం టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు మరియు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Red Flower And Hibiscus Hot Tea. Isolated On White Backgroun
Hibiscus Tea : ఎరుపు రంగులో ఉండే మందార పువ్వులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. మందారం పువ్వుల రేకలతో తయారు చేసిన టీ లో ఎన్నో ఔషదగుణాలు ఉండటంతో దీనిని తాగేందుకు ఎక్కవ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎండిన మందార పువ్వులతో తయారు చేసిన టీ తాగటం వల్ల పాలీఫెనాల్స్ ,ఆంథోసైనిన్స్ అందుతాయి. ఇవి శరీరానికి ప్రయోజనాలకు అందిస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారిలో రక్తపోటును తగ్గించే సామర్థ్యం మందార టీకి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆరు వారాల పాటు మందార టీ తాగిన వారిలో రక్తపోటు తగ్గినట్లు గుర్తించారు.
గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకంగా ఉండే ఎల్‌డిఎల్ అనగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించటంలో మందార టీ సహాయపడుతుంది. అదే విధంగా మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు దోహదపడుతుంది. మందారం టీ జీవక్రియల రేటు పెంచటంతోపాటు అరుగుదలకు దోహదపడుతుంది. బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను మందారం టీ కలిగి ఉంది. మందార టీలో విటమిన్ సి , క్యాల్షియం, ఫైబర్, ఐరన్ , ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి. అందుకే రోజూ ఒక కప్పు మందారం టీ తాగడం వల్ల.. శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మందార టీ తాగడం టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు మరియు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మందార టీలో టైటో 2 డయాబెటిస్ ఉన్న రోగులపై సానుకూల ప్రభావాలను చూపించే ఫైటోకెమికల్స్ ఉన్నాయి. మధుమేహం వున్నవారి విషయంలో మందారం టీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. న్యుమోనియా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మరియు విరేచనాలకు కారణమయ్యే కోలి బ్యాక్టీరియాను నిరోధించే బలమైన సామర్థ్యాన్ని మందారం టీ కలిగి ఉంటుంది.
ఇదిలా వుంటే మందారం టీని కొంత మంది తీసుకోకుండా ఉండటమే మంచిది. కొన్ని రకాల జబ్బులతో బాధపడుతున్న వారు దీనిని తీసుకోవటం వల్ల దుష్పప్రభావాలు చవి చూడాల్సి వస్తుంది. తక్కువ రక్తపోటు ఉన్న వారు మందారం టీ తాగటం వల్ల మూర్చ, మైకం వంటివి కలిగే అవకాశం ఉంటుంది. వణుకు, మలబద్ధకం మరియు కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు మందారం టీ తాగటం అంతమంచిది కాదు. మందార టీ తాగితే కొందరిలో కళ్ళు దురద, సైనస్ లేదా జ్వరం వంటి అలెర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి.